‘జాను’ మూవీ రివ్యూ: ఏడిపిస్తూనే.. హిట్టు కొట్టేశారు

సినిమా: ‘జాను’ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ డైరెక్టర్: సీ ప్రేమ్ కుమార్ సంగీతం: గోవింద్ మీనన్ సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: శర్వానంద్, సమంత, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్, తదితరులు సినిమా విడుదల తేదీ: 07.02.2020 శర్వానంద్, సమంతలు జంటగా కలిసి నటించిన సినిమా ‘జాను’. ఇది ’96’కి రీమేక్‌గా తీశారు. ఇప్పటికే ’96’ మూవీని చాలామంది తెలుగువాళ్లు కూడా చూసే ఉంటారు. ప్రతీ సన్నివేశం హృద్యంగా, […]

‘జాను' మూవీ రివ్యూ: ఏడిపిస్తూనే.. హిట్టు కొట్టేశారు
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 12:38 PM

సినిమా: ‘జాను’ నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్ డైరెక్టర్: సీ ప్రేమ్ కుమార్ సంగీతం: గోవింద్ మీనన్ సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నటీనటులు: శర్వానంద్, సమంత, శరణ్య ప్రదీప్, వెన్నెల కిషోర్, తదితరులు సినిమా విడుదల తేదీ: 07.02.2020

శర్వానంద్, సమంతలు జంటగా కలిసి నటించిన సినిమా ‘జాను’. ఇది ’96’కి రీమేక్‌గా తీశారు. ఇప్పటికే ’96’ మూవీని చాలామంది తెలుగువాళ్లు కూడా చూసే ఉంటారు. ప్రతీ సన్నివేశం హృద్యంగా, ఓ దృష్యకావ్యంలా ఉంటుంది. అంతలా ఆ మూవీ ప్రేక్షకులు మదిలో చోటు సంపాదించుకుంది గనుకే.. ఆ సినిమాను ఎంతో ఇష్టపడి తెలుగులోకి కూడా రీమేక్ చేశారు నిర్మాత దిల్ రాజు. తమిళ దర్శకుడైన సి. ప్రేమ్ కుమార్‌నే ‘జాను’కి కూడా దర్శకత్వం వహించారు. మరి దిల్ రాజు పెట్టుకున్న ఆశలను, అంచనాలను ఈ మూవీ నిజం చేసిందా లేదా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటూ ఉంటారు జాను, రామ్‌లు. వారిద్దరూ మంచి స్నేహితులు. స్కూల్ టైంలోనే తెలియకుండానే.. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ పుడుతుంది. కానీ దాన్ని చెప్పేందుకు మాత్రం ఎవరూ ధైర్యం చేయరు. ఆ తరువాత కాలేజీ రోజుల్లో విడిపోతారు. మళ్లీ ’96’ బ్యాచ్ పేరుతో చాలా సంవత్సరాల తర్వాత కలుస్తారు. అప్పుడైనా.. రామ్.. జానూకి ప్రపోజ్ చేశాడా? లేదా? దానికి జానూ ఒప్పుకుందా? లేక తనికి పెళ్లి అయిపోయిందా? అసలు ట్విస్ట్ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా నటించారంటే: శర్వానంద్, సమంతల యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎందుకంటే వాళ్లు ఇదివరకే వచ్చిన ‘మళ్లీ ఇది రాని రోజు, మజిలీ’ సినిమాలతో ప్రూవ్ చేసుకున్నారు. ఇక మిగతా పాత్రధారులు కూడా వారి క్యారెక్టర్లకు తగిన న్యాయం చేశారు. స్కూల్‌ టైంలో ఉన్న జాను, రామ్ పాత్రల్లో చేసిన పిల్లలు అయితే చక్కగా నటించారు.

ఎలా ఉందంటే: తమిళంలో వచ్చిన ’96’ని ‘జాను’ని మెప్పించిందనడంలో అతియోక్తి కాదు. ఎందుకంటే.. ఇదివరకే ఈ సినిమాని చూసినవారు సమంత బాగా చేసిందా.. త్రిష బాగా చేసిందా, విజయ్‌ సేతుపతిని.. శర్వానంద్ మరపించగలిగాడా అని కూడా చూస్తారు. మరి ఇన్ని చిక్కుల మధ్య ‘జాను’ ప్రేక్షకులను మెప్పించడమంటే మామూలు విషయం కాదు. సినిమా మొదట నెమ్మదిగా స్టార్ట్ అయినా.. మంచి ఫీల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక ఆ స్కూల్లో జరిగిన సన్నివేశాలు మనల్ని గతంలోకి తీసుకువెళ్తాయి.

ప్లస్ పాయింట్స్:

కథ కథనం నటీనటుల యాక్టింగ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

స్లో నేరేషన్

చివరిగా.. మ్యాజిక్ చేసే ఓ ప్రేమకథ.. ఓడిపోయినా సక్సెస్ అయింది.

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్