రెండో రోజూ వసూళ్ల వరద…పూరి పునర్వైభవం

యస్..పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.“ఇస్మార్ట్ శంకర్”తో ఇండస్ట్రీ దిమ్మతిరిగిపోయే హిట్ ఇచ్చాడు. రెగ్యులర్‌గా ఒక ప్లాపో, యావరేజ్ సినిమానో ఇస్తాడనుకున్న వారి బెండ్ తీశాడు.థియేటర్స్ దగ్గర పూరి అభిమానుల రచ్చ మాములుగా లేదు. గత కొంతకాలంగా అచ్చం తమదైన సినిమా కోసం ఎదురుచూస్తున్న మాస్ ఆడియెన్స్ పూరికి ఏకంగా బీర్లతో అభిషేకం చేస్తున్నారు.సినిమా చూసిన ప్రతివారు పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. Also Read: ఇస్మార్ట్ కలెక్షన్స్..ఇది పూరి రేంజ్ బాస్! హీరో రామ్ కి కూడా […]

రెండో రోజూ వసూళ్ల వరద...పూరి పునర్వైభవం
Follow us

|

Updated on: Jul 20, 2019 | 12:08 PM

యస్..పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.“ఇస్మార్ట్ శంకర్”తో ఇండస్ట్రీ దిమ్మతిరిగిపోయే హిట్ ఇచ్చాడు. రెగ్యులర్‌గా ఒక ప్లాపో, యావరేజ్ సినిమానో ఇస్తాడనుకున్న వారి బెండ్ తీశాడు.థియేటర్స్ దగ్గర పూరి అభిమానుల రచ్చ మాములుగా లేదు. గత కొంతకాలంగా అచ్చం తమదైన సినిమా కోసం ఎదురుచూస్తున్న మాస్ ఆడియెన్స్ పూరికి ఏకంగా బీర్లతో అభిషేకం చేస్తున్నారు.సినిమా చూసిన ప్రతివారు పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు.

Also Read: ఇస్మార్ట్ కలెక్షన్స్..ఇది పూరి రేంజ్ బాస్!

హీరో రామ్ కి కూడా చాలాకాలం తరువాత అదిరిపోయే హిట్ దక్కింది. రామ్ నటవిశ్వరూపానికి వసూళ్ల వరద పారుతోంది. పూరి మార్క్ హీరోయిజంకి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ బంపర్ బోనాంజా కొనసాగుతోంది. వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి రోజు ఆశ్చర్యకరంగా 7.83 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం రెండవ రోజు కూడా అంచనాలకు మించిన వసూళ్లు సాధించింది. రెండవరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 4.28కోట్ల వసూళ్లతో నిలకడగా ఉంది. ఈవారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం, సుధీర్గమైన వారాంతం ఈ మూవీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్ లు లాభాలలోకి ప్రవేశించారని సమాచారం. ఈ వారాంతం చివరికి ఇస్మార్ట్ శంకర్ 20కోట్ల షేర్ రాబట్టే అవకాశం ఉందని అంచనా.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ రెండవ రోజు షేర్

నైజాం-రూ. 1.96 కోట్లు సీడెడ్ _రూ. 0.7కోట్లు ఉత్తరాంధ్ర -రూ.0.52కోట్లు ఈస్ట్ -రూ.0.29కోట్లు వెస్ట్ -రూ.0.21కోట్లు కృష్ణ -0.25కోట్లు గుంటూరు-0.24కోట్లు నెల్లూరు-రూ.0.12కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28కోట్లు

Also Read: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ