ఇస్మార్ట్ కలెక్షన్స్..ఇది పూరి రేంజ్ బాస్!
‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ దక్కింది. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. Also Read: ఇస్మార్ట్ శంకర్’ […]

‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ దక్కింది. మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది.
Also Read: ఇస్మార్ట్ శంకర్’ మూవీ రివ్యూ
అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో మ్యాజికల్ వేవ్స్ క్రియేట్ చేస్తున్నడు ఈ లోకల్ పోరడు. “ఇస్మార్ట్ శంకర్” ఏకంగా మొదటి రోజు 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రాస్ అయితే 14 కోట్లకు పైగానే వచ్చింది. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే తొలిరోజే 8.57 కోట్ల షేర్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. రెండో రోజు కూడా ఇస్మార్ట్ విధ్వంసం ఇలాగే సాగేలా కనిపిస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది . పూరీ మార్క్ మాస్ డైలాగులతో ఈ సినిమా నిండిపోయింది. దానికి తోడు రామ్ యాక్టింగ్.. హీరోయిన్లు నిధి, నభా నటేష్ గ్లామర్ షో అదనపు ఆకర్షణ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు నాలుగు రోజుల్లోనే దాన్ని క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరో సినిమా కూడా ఏదీ బాక్సాఫీస్ దగ్గర లేకపోవడం ఇస్మార్ట్ శంకర్‌కు కలిసొచ్చే అంశం.
ఏరియా | కలెక్షన్స్ |
నైజాం | 3.43 కోట్లు |
సీడెడ్ | 1.20 కోట్లు |
వైజాగ్ | 0.86 కోట్లు |
ఈస్ట్ | 0.50 కోట్లు |
వెస్ట్ | 0.40 కోట్లు |
కృష్ణ | 0.53 కోట్లు |
గుంటూరు | 0.57 కోట్లు |
నెల్లూరు | 0.30 కోట్లు |
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి | 7.83 కోట్లు |