AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీం

New Zealand vs Pakistan: టీ20 సిరీస్ ఓడిన తర్వాత పాకిస్తాన్ ఆశలు వన్డే సిరీస్ పైనే ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా కథ అలాగే ఉంది. మైదానం మారింది. పాకిస్తాన్ జట్టులో మార్పు వచ్చింది. కానీ, వారి ఓటముల పరంపర మాత్రం మారలేదు. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను జట్టులోకి తీసుకున్నప్పటికీ పాకిస్తాన్‌కు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు.

Video: ఒరేయ్ ఆజామూ.. గల్లీ ప్లేయర్‌ల కంటే దారుణంగా ఉన్నారేంది.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీం
Pak Vs Nz Video
Venkata Chari
|

Updated on: Mar 29, 2025 | 8:13 PM

Share

New Zealand vs Pakistan: గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ ఫీల్డింగ్ ప్రమాణాలు దిగజారిపోతూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తాజాగా శనివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మొదటి వన్డేలో పాకిస్తాన్ టీం మరోసారి నవ్వుల పాలయ్యారు. దీంతో సోషల్ మీడియాలో పాక్ జట్టుపై తెగ ట్రోల్స్ వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు దిగగా, పాకిస్తాన్ పైచేయి సాధించింది. ఆ జట్టు కేవలం 50 పరుగులకే 3 కివీస్ వికెట్లు పడగొట్టింది. అయితే, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్ పాకిస్తాన్ బౌలింగ్ దాడిని చిత్తు చేశారు. క్లీన్ హిట్టింగ్‌తో దడదడలాడించారు.

ఇవి కూడా చదవండి

పాకిస్తాన్ ఫీల్డర్ల తప్పిదాలు.. సిరీయస్ గేమ్‌లో కామెడీ..

వికెట్ల మధ్యలో వేగంగా పరిగెత్తడం ద్వారా ఫీల్డర్లపై ఒత్తిడి తెచ్చారు. పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్‌తో ఈ ఇద్దరూ సింగిల్ వచ్చే చోట మూడు పరుగులు సాధించారు. చాప్‌మన్ ఒక షాట్ ఆడాడు. త్వరగా సింగిల్ కోసం పరిగెత్తాడు. అయితే, డీప్ నుంచి వచ్చిన ఫీల్డర్ స్పందించడంలో ఆలస్యం చేశాడు. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు త్రో చేశాడు.

కివీస్ ద్వయం మరో పరుగు కోసం పరిగెత్తడంతో బంతి మరోసారి నో మ్యాన్స్ ల్యాండ్‌లోకి వెళ్లింది. ఈసారి, ఆ ఇద్దరూ మరో పరుగు కోసం ట్రై చేశారు. ఈ క్రమంలో మొహమ్మద్ రిజ్వాన్ బంతిని అందుకోలేకపోయాడు. వారికి మరో పరుగు తీసే అవకాశం వచ్చింది.

బాబర్ అజామ్ ప్రయత్నం చేసినప్పటికీ ఓడిన పాకిస్తాన్..

నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో గెలవాలంటే పాకిస్థాన్‌కు 345 పరుగుల భారీ లక్ష్యం అవసరం. మంచి ఆరంభం ఉన్నప్పటికీ పాక్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బాబర్ అజామ్ రిజ్వాన్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాడు. 78 పరుగులకు అవుటయ్యే ముందు తన 20వ వన్డే సెంచరీకి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడు.

ఆ తర్వాత అఘా సల్మాన్ వేగంగా ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. మొత్తంగా పాక్ జట్టు 271 పరుగులకే ఆలౌట్ అయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..