
కల్కి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి వెయ్యికోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. బాహుబలి సినిమా తర్వాత కల్కి ఆ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మహాభారత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు పలువురు దర్శకులు కూడా ఈ సినిమాలో నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి, అవసరాల శ్రీనివాస్ ఇలా చాలా మంది ఈ సినిమాలో కనిపించారు. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పలు పార్ట్స్‌గా తెరకెక్కించనున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
కల్కి సినిమా థియేటర్స్ లో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ఆకట్టుకుంటుంది. కల్కి 2898ఏడీ సినిమా రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. నెట్ ఫ్లిక్స్ లో కల్కి హిందీ వర్షన్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇతర భాషల్లో కల్కి సినిమా అందుబాటులో ఉంది. త్వరలోనే కల్కి 2 సినిమాను తెరకెక్కించనున్నారు నాగ్ అశ్విన్. అయితే కల్కి 2 సినిమాలో ఓ యంగ్ హీరో కూడా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. తేజ సజ్జ. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నాడు తేజ.. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అలాగే ఇప్పుడు మిరాయ్ సినిమాతో రానున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. త్వరలోనే సినిమా రానుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే కల్కి 2 సినిమాలో తేజ సజ్జ నటిస్తున్నాడని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది కల్కి 2సినిమాలో తేజ కల్కి పాత్రలో కాం అభిమన్యుడి పాత్రలో కానీ కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలి ఉంది. ప్రస్తుతం మిరాయ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేర్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి