Upasana Konidela: ఈ స్థాయి ఎవరో ఇచ్చింది కాదు.. నాకు నేనుగా సాధించుకున్నది
ప్రముఖ వ్యాపారవేత్త, మెగాకోడలు..రామ్‌చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తనకు వచ్చిన గుర్తింపు వారసత్వం వల్లనో, వివాహ బంధం వల్లనో వచ్చింది కాదని, ఎన్నో ఒత్తిళ్లు, బాధలను ఎదుర్కొని తన స్వశక్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఖాస్ ఆద్మీ పార్టీ’ అనే వినూత్న ఆలోచనను పంచుకుంటూ, ఒక వ్యక్తిని ఏది ప్రత్యేకంగా నిలబెడుతుందనే అంశంపై స్ఫూర్తిదాయకమైన పోస్ట్ చేశారు.
డబ్బు, హోదా, విజయం, కీర్తి వంటివి ఒక వ్యక్తిని గొప్పవారిని చేస్తాయా? లేక వారిలోని అంతర్గత లక్షణాలైన భావోద్వేగ స్పష్టత, ఇతరులకు సాయం చేసే గుణం వంటివి గొప్పవారిని చేస్తాయా? అని ఉపాసన తన పోస్టులో ప్రశ్నించారు. సమాజం తరచుగా బయటికి కనిపించే విజయాలకే విలువ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. నేటికీ మన సమాజం.. మహిళలను నిరాడంబరంగా ఉండాలని, తగిన అవకాశాల కోసం మహిళలు ఎదురుచూడాల్సిందేననే భావనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పెద్ద పెద్ద కలలను మన సమాజం నేటికీ ప్రోత్సహించదని వాపోయారు. “నేను నా పెద్దల కుటుంబ వారసత్వం వల్లనో లేదా మరో గొప్ప ఇంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్లనో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందలేదు. ఒత్తిడిని, బాధను తట్టుకుని ఎదగడాన్ని ఎంచుకున్నాను. ఎన్నోసార్లు కిందపడ్డాను, పడిన ప్రతిసారీ మళ్లీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నాపై నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను. చివరికి నేను అనుకున్న లక్ష్యాలను సాధించాను. అందుకే నేను ఈ సమాజంలో నాదైన గుర్తింపును పొందగలిగాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్నిసార్లు నన్ను నేను అవమానించుకున్నాను కూడా” అని ఆమె తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అసలైన బలం ఆత్మగౌరవంలోనే ఉంటుందని, దానికి డబ్బు, హోదా, కీర్తితో సంబంధం లేదని ఆమె అన్నారు. “అహంకారం గుర్తింపును కోరుకుంటుంది, కానీ ఆత్మగౌరవం నిశ్శబ్దంగా గుర్తింపును సృష్టిస్తుంది” అని ఆమె వివరించారు. మనల్ని మనం ప్రేమించుకుని, మనకు మనం విలువ ఇచ్చుకున్న క్షణాలే.. మనల్ని నలుగురిలో ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలుపుతాయి. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (2016) ప్రకారం.. 50 శాతం మంది భారతీయులు పలు మానసిక సమస్యలతో నేటికీ తమ లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా 16 శాతం మహిళలు జీవితాంతం డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఈ పరిస్థితి మారితే.. సమాజంలో ఎంతో మార్పు వస్తుంది. ‘చాలామంది అనుకుంటున్నట్లుగా.. ఏ రంగంలోనైనా మార్పు రావటానికి ఎక్కువ టైం పట్టదు. ఒక్క సెకనులో వచ్చే మీ ఆలోచనతోనే గొప్ప మార్పు మొదలవుతుంది. నేను మీతో నిజాయితీగా ఉండాలనుకున్నా. అందుకే ఈ పోస్టు పెట్టా. నా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అభిప్రాయాలు పంచుకున్నానే తప్ప ఓ నిపుణురాలిగా కాదు’’ అని ఉపాసన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 నెలల్లో 6G వస్తోంది..ప్రధాని మోదీ కీలక ప్రకటన
Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య
‘మిస్ అవుతున్నా నాన్నా..’ గౌతమ్ బర్త్ డే వేళ మహేష్ ఎమోషనల్
నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

