Balakrishna: వరద బాధితులకు అండగా.. విరాళం ప్రకటించిన బాలయ్య
ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించారు. ఆగస్టు 30న హైదరాబాద్ లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విరాళాన్ని ప్రకటించారు.
వరదల్లో నష్టపోయిన అన్నదాతలు, సామాన్యులకు తన వంతుగా ఉడతా భక్తిగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. మున్ముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారుఅంతకు ముందు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రిలీఫ్ ఫండ్ కు 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలకృష్ణ. నటనలోనూ, రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ కుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కొందరి హీరోలకు మాత్రమే సాధ్యమైన పౌరాణికి సినిమాలతోనూ బ్లాక్ బస్టర్స్ కొట్టారు. సినిమా ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగు పెట్టి ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన అందిస్తోన్న సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆయనకు స్థానం దక్కింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మిస్ అవుతున్నా నాన్నా..’ గౌతమ్ బర్త్ డే వేళ మహేష్ ఎమోషనల్
నా అత్తమ్మ తన కళ్లను దానం చేసింది.. ఫోటోలతో సహా.. చూపించిన చిరు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

