Mahesh Babu: గురూజీ మాస్టర్ ప్లాన్.. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ విలక్షణ నటుడు..

మహేష్ బాబు సినిమా అంటే అభిమానుల్లో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్..

Mahesh Babu: గురూజీ మాస్టర్ ప్లాన్.. మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆ విలక్షణ నటుడు..
Mahesh Babu , Trivikram
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 28, 2022 | 5:00 PM

మహేష్ బాబు(Mahesh Babu) సినిమా అంటే అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు క్లాస్ సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్.. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సరిలేరు నీకెవ్వరు అంటూ మాస్ సినిమాతో ఫ్యాన్ ను ఖుష్ చేశారు. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సర్కారు వారి పాట అంటూ సందడి చేయనున్నారు. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. అతి త్వరలోనే షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్రయూనిట్. ఈ సినిమాతో మహేష్ సరసన కీర్తిసురేష్ తొలిసారి నటిస్తుంది. ఇక ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్. అతడు, ఖలేజా సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మహేష్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సారి గురూజీ మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బుట్ట బొమ్మ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ను ఫిక్స్ చేశారు గురూజీ. ఇక ఈ సినిమా పై ఇప్పటికే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్  గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ్ స్టార్ హీరోను తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించనున్నారని అంటున్నారు. సేతుపతి ఇటీవల తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాలో విజయ్ దెతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మహేష్ సినిమాకోసం గురూజీ విజయ్ దెతుపతితో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. దాదాపు 11 ఏళ్ల విరామం తరువాత మహేష్ – త్రివిక్రమ్ ల కలయికలో రాబోతున్న మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో వుంది.

Vijay Sethupathi

మరిన్ని ఇక్కడ చదవండి : 

Oscars 2022: భార్యపై కుళ్లు జోకులు.. స్టేజ్ పైనే హోస్ట్ చెంప చెల్లుమనించిన హీరో.. ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ సీన్..

Oscar Winners 2022: ఆస్కార్ అవార్డులలో డ్యూన్ చిత్రయూనిట్ హవా.. విన్నర్స్ ఎవరెవరంటే..

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. బాబీ మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్.. భారీ యాక్షన్ షెడ్యూల్..