ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు జక్కన తెరకెక్కిన ఈ సినిమాలో తారక్ కొమురం భీమ్ గా నటించి అకరించాడు. తారక్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాతో తారక్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లోను సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక తారక్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నరు. ఇటీవలే మెగాస్టార్ తో కొరటాల ఆచార్య అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఇప్పుడు తారక్ సినిమాతో భారీ హిట్ కొట్టాలన్న కసి మీదున్నారు కొరటాల. ఇప్పటికే ఓ పవర్ ఫుల్ కథను కూడా సిద్ధం చేశారట ఈ టాప్ డైరెక్టర్. అయితే ఈ సినిమా టైటిల్ గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ తో సినిమా పై కావలసినంత బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను పరీశీలిస్తున్నారట. అయితే బడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ప్రేమగా దేవర అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ తో తారక్ సినిమా రాబోతుందని అంటున్నారు.
ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేశారట కొరటాల.. ఈ టైటిల్ పై బండ్ల గణేష్ అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని అనుకుంటున్నారట.. అలాగే సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కూడా పరిశీలనలో ఉందట. ఈ వార్తలపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.