Alia Bhatt : ‘ఆర్ఆర్ఆర్’ ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..

ఆలియాకీ, జక్కన్నకీ మళ్లీ తేడాలొచ్చేశాయా.. ట్రిపులార్ సక్సెస్‌ని ఆమె మనస్పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారా.. అనే డౌట్లు మరోసారి రిపీటౌతున్నాయి.

Alia Bhatt : 'ఆర్ఆర్ఆర్' ముంబై ఈవెంట్‌లో సీతమ్మ కనిపించకపోవడానికి కారణం ఇదేనా..
Aliya
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 10, 2022 | 6:44 PM

ఆలియాకీ, జక్కన్నకీ మళ్లీ తేడాలొచ్చేశాయా.. ట్రిపులార్ సక్సెస్‌ని ఆమె మనస్పూర్తిగా ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారా.. అనే డౌట్లు మరోసారి రిపీటౌతున్నాయి. అదేంటి.. నిన్నమొన్నేగా రాజమౌళితో అంతా ఓకే అని ఆలియా(Alia Bhatt)స్టేట్‌మెంటిచ్చారు.. అంతలోనే ఏమైంది వీళ్లకి అని చెవులు కొరుక్కుంటున్నారు జనాలు. కానీ.. ఇది కూడా టీకప్పులో తుపానులాగే చప్పున చల్లబడిపోయింది. సంక్రాంతి సీజన్‌లో ట్రిపులార్ వచ్చేస్తోంది అనగా అప్పట్లో కనిపించిన జోష్ ఇది. ఆ తర్వాత రిలీజ్ డేట్‌ మార్చి25కు మారినప్పుడు.. ప్రమోషన్‌లో అక్కడక్కడా మాత్రమే కనిపించి మమ అనిపించారు ఆలియాభట్. సినిమా విడుదలైనప్పుడైతే తప్పక చూడండి అని కనీసం ఫార్మాలిటీ కోసం ట్వీట్ కూడా చెయ్యలేదు. ఇప్పుడు ముంబైలో జరిగిన ట్రిపులార్ సక్సెస్ మీట్‌లో వెతికినా కనిపించలేదు సీతమ్మ వారి జాడ.

జక్కన్నకీ, సీతమ్మకీ మధ్య డిఫరెన్సెస్ వచ్చాయనే రూమర్స్‌ని మొన్నీమధ్యే కొట్టిపారేశారు ఆలియా. ఇక్కడంతా ఆల్ ఈజ్ వెల్.. మీరందరూ అనుకున్నట్టు స్క్రీన్ స్పేస్ విషయంలో రాజమౌళి నన్నేమీ మోసం చెయ్యలేదు అని క్లారిటీ ఇచ్చారు. మరి.. తన ఊర్లోనే జరిగిన ట్రిపులార్ వెయ్యికోట్ల సంబరంలో ఆమె ఎందుకు పార్టిసిపేట్ చెయ్యలేదు.? సినిమాతో సంబంధమే లేని రాఖీ సావంత్, హ్యూమా ఖురేషి లాంటి వాళ్లంతా వచ్చి ఈవెంట్‌ని గ్రేస్‌ఫుల్‌గా మార్చేశారు. ఆలియా అడ్రస్ మాత్రం గల్లంతయిందెందుకు? అని బీటౌన్‌లోనే ఇప్పుడు ఒకటే గుసగుస. ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకను పెన్‌ స్టూడియోస్ ఆర్గనైజ్ చేసింది. ఈవెంట్ జరిగే సమయంలో ఆలియా ముంబైలోనే వున్నారు. కానీ.. ఈనెల 17న రణ్‌బీర్‌తో జరగబోయే తన పెళ్లి ఏర్పాట్లలో బిజీగా వున్నారు. కొన్ని సినిమాల షూటింగ్స్‌ కూడా రద్దు చేసుకున్నారట. అయినా.. ట్రిపులార్ కోసం తెలుగు నేర్చుకున్నానని, హైదరాబాద్‌ బిర్యానీకి బానిసయ్యానని పదేపదే చెప్పుకునే ఆలియా.. ట్రిపులార్ సక్సెస్‌ని ఎంజాయ్ చెయ్యకుండా ఎందుకుంటారు.. అని ఫైనల్‌గా ఓ కంక్లూజన్‌కొస్తోంది ముంబై మీడియా.

మరిన్ని ఇక్కడ చదవండి :