AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ను వెంటాడుతున్న ఆకస్మిక మరణాలు

కాంటా లగా గర్ల్ షెఫాలీ మరణంతో..ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక బిగ్‌ డిబేట్‌ నడుస్తోంది. ఆ షోలో పాల్గొన్న నటీనటులు హఠాత్తుగా చనిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా యాదృశ్చికంగానే జరుగుతున్నా...చర్చ మాత్రం ఇప్పుడా షోపైకి మళ్లింది. ఇంతకూ ఏంటా షో...మన తెలుగులోనూ ఆ షో రన్ అవుతోంది. మనదగ్గర కూడా ఇలాంటి సడెన్ డెత్ చోటు చేసుకుందా..?

Bigg Boss: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ను వెంటాడుతున్న ఆకస్మిక మరణాలు
Sidharth Shukla - Shefali Jariwala - Surya Kiran
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2025 | 3:52 PM

Share

సోమదాస్ చాతన్నూర్, జయశ్రీ రామయ్య, మన తెలుగు డైరెక్టర్ సూర్యకిరణ్… వీళ్లందరూ చనిపోయారు. వీళ్లందరి మరణం యాదృశ్చికమే. కానీ వీళ్లందరికీ ఒక కామన్ లింక్‌ ఉంది. అదే బిగ్‌బాస్‌షో. వీరంతా బిగ్‌బాస్ షోలో పాల్గొన్నవారే.

షెఫాలీ జరివాలా, బిగ్ బాస్ 13లో పాల్గొన్న ప్రముఖ నటి, 42 ఏళ్ల వయసులో శుక్రవారం రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయింది. 2002లో ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోతో యువతను ఉర్రూతలూగించింది షెఫాలీ. అయితే ఆమె ఎలా చనిపోయిందన్నది ఇంకా నిర్థారణ కాలేదు. పోలీసుల విచారణ జరుగుతోంది. షెఫాలీకి డిప్రెషన్, ఎపిలెప్సీ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.

షెఫాలీతోపాటు షోలో పాల్గొన్న కొంతమంది నటులు చిన్న వయసులోనే మరణించారు. సిద్ధార్థ్ శుక్లా, బిగ్ బాస్ 13 విజేత, 2021లో 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. శుక్లాకు యూత్‌లో మంచి క్రేజుంది.

ప్రత్యూషా బెనర్జీ, బిగ్ బాస్ 7 పాల్గొంది. 2016లో ఆత్మహత్య చేసుకుంది. టీవీ కార్యక్రమాలతో ప్రత్యూషా ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక స్వామి ఓం, బిగ్ బాస్ 10లో కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన కంటెస్టెంట్. 2021లో కోవిడ్-19 కారణంగా చనిపోయాడు.

సోనాలీ ఫోగట్, బిగ్ బాస్ 14లో పాల్గొన్న పొలిటికల్ లీడర్. 2023లో 42 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించింది. ఇక సోమదాస్ చాతన్నూర్ మలయాళం బిగ్‌బాస్ సీజన్ 1లో పార్టిస్పేట్ చేశాడు. 2021లో కోవిడ్ తో చనిపోయాడు.

జయశ్రీ రామయ్య, బిగ్ బాస్ కన్నడ సీజన్ 3లో కనిపించిందీ నటి, 2020లో ఆత్మహత్య చేసుకుంది. మానసిక సమస్యల కారణంగా చనిపోయినట్లు రిపోర్టులో తేలింది

‘బిగ్ బాస్ సీజన్ 1’ పార్టిసిపెంట్ కత్తి మహేష్ సైతం ఆకస్మికంగా కన్నుమూశారు. 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించి కన్నుమూశారు.

తెలుగు బిగ్‌బాస్‌షోలో పాల్గొన్న సత్యం డైరెక్టర్ సాయికిరణ్ కూడా పచ్చ కామెర్లు, గుండెపోటుతో చనిపోయారు. 2024 మార్చి 11న చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారాయన. సూర్యకిరణ్, ‘సత్యం’, ‘ధన 51’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. బాలనటుడిగా 200కు పైగా చిత్రాల్లో నటించాడు.

ఇలా గుండెపోటు, ఆత్మహత్య, కోవిడ్-19 వంటి కారణాలతో వీరంతా చనిపోయారు. కంటెస్టెంట్ మరణాలకు బిగ్‌బాస్ షోకు ఎలాంటి సంబంధం లేదు. యాదృశ్చికంగా చోటు చేసుకున్న సంఘటనలే .కానీ వీరంతా బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో చర్చ బిగ్‌బాస్‌పైకి మళ్లింది.