AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: పెళ్లైన తర్వాత కూడా పుస్తకం పట్టుకుంటోన్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఏం చదువుకుందో తెలుసా?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 2020లో తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఒక అన్వి రెడ్డి బాబు ఉన్నాడు. ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది తేజస్విని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది.

Dil Raju: పెళ్లైన తర్వాత కూడా పుస్తకం పట్టుకుంటోన్న దిల్ రాజు భార్య.. తేజస్విని ఏం చదువుకుందో తెలుసా?
Dil Raju Wife
Basha Shek
|

Updated on: Jun 29, 2025 | 4:18 PM

Share

గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది దిల్ రాజు భార్య తేజస్విని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటోంది. ఇటీవల తన భర్తతో కలిసి పారిస్ వెకేషన్ కు వెళ్లొచ్చిన ఆమె ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కాగా దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన చదువు, విద్యార్హతలు అలాగే దిల్ రాజుతో వివాహం తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడింది. ‘నేను హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాను. నా స్టడీ అంతా హైద్రాబాద్ లోనే లేడీస్ స్కూల్ , కాలేజీల్లోనే సాగింది. సెయింట్ యాన్స్ లో స్కూలలో చదువుకున్నాను శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ తర్వాత కస్తూరి బా గాంధీ కాలేజీలో డిగ్రీ చదివాను. నాచారం సెయింట్ పియస్ కాలేజీలో బయో కెమిస్ట్రీలో పిజి చేశాను. మా అమ్మ హైకోర్టు అడ్వాకేట్. ఆమె కోసం పిజి తర్వాత పెండేకంటి లా కాలేజీ లో లా చదివాను. లా చదువుతున్నప్పుడే దిల్ రాజుతో నా వివాహమైంది. పెళ్లి అయ్యాక కూడా చదివాను. 2024 లోనే లా పూర్తి చేశాను. నేను స్టడీస్ లో మంచి స్టూడెంట్ నే’ అని చెప్పుకొచ్చింది తేజస్విని.

దిల్ రాజు భార్యకు క్లాసికల్ డ్యాన్స్ లోనూ మంచి ప్రావీణ్యముంది. గతంలో ఆమె పలు పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చింది. ఇక దిల్ రాజుతో వివాహం గురించి మాట్లాడుతూ.. ‘ అసలు మా ఫ్యామిలీకి సినిమాలకు కనెక్షన్ చాలా తక్కువ. ఏడాదికి ఒక సినిమాకి వెళ్లే వాళ్లం. దిల్ రాజు గారిని మొదట డైరెక్టర్ అనుకున్నాను. తర్వాతనే ఆయన నిర్మాత అని తెలిసింది. మొదట ఫ్లైట్ లోనే మా పరిచయం జరిగింది. ప్రేమగా మారింది. ఆ తర్వాత తర్వాత దిల్ రాజు గారే మా ఇంట్లో ఎవర్ని అడగాలో చెప్పు అడిగి ఒప్పిస్తా అన్నారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మా పెద్దమామ, పిన్ని, చిన్నమామ చాలా స్ట్రిక్ట్. మా పిన్ని, మామ ఎవరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అసలు వద్దన్నారు. అందులోను రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారు. కానీ అందర్నీ ఒప్పించి మేం  పెళ్లి చేసుకున్నాం’అని తేజస్వని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

భర్త దిల్ రాజుతో కలిసి వెకేషన్ లో..

పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us