AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ 21 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం.. మీ రాశికి ఇలా..

Horoscope Today (June 21, 2026): ఆదివారంనాడు మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారిలో కొన్ని రాశుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దీని ప్రభావంతో ఆ రాశుల వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆకస్మిక ధనలాభాలు, కొత్త అవకాశాలు కలిసిరానున్నాయి. అయితే కొన్ని రాశుల వారు కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీ రాశికి ఈ రోజు ఎలా ఉండబోతోందో తెలుసుకోండి.

జూన్ 21 రాశిఫలాలు: వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం.. మీ రాశికి ఇలా..
Horoscope Today 21 June 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 21, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూన్ 21, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి ఉద్యోగులకు వారి పనితీరు, సమర్థతకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు బాగా తగ్గుతాయి. బంధుమిత్రులతో ఒకటి రెండు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగుల పనితీరు, సమర్థతకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. సొంత వ్యవహారాలు, కుటుంబ విషయాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులు మీకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆర్థికంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. పెండింగు పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో కొద్దిపాటి మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాలను పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. షేర్లు లాభిస్తాయి. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ధన యోగం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలతో జీవిత భాగస్వామి సలహాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. పట్టుదలగా ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తు వాహన లాభాలు పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సంబంధించి విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఒకటి రెండు చిన్నపాటి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

Also Read: వారఫలాలు: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..మీ రాశికి ఎలా ఉందంటే..?

Follow Us