
ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ పేరు ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. 2002లో తన తండ్రి ఫాజిల్ చిత్రం “కయేందుం దహార్”తో సినీ రంగ ప్రవేశం చేశాడు ఫహద్ ఫాజిల్. మొదటి సినిమాకే అతనికి అంత ఆదరణ లభించలేదు. దీంతో ఏడేళ్లకు పైగా సినిమాలకు దూరమయ్యాడు ఫహద్ ఫాజిల్. ఆతర్వాత 2009లో “కేరళ కేఫ్” సినిమాతో మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఆ తర్వాత చప్పా కురుసు, అఘం, అన్నైయుమ్ రసూల్ వంటి చిత్రాలతో పాపులర్ అయ్యాడు ఫహద్. ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫహద్ ఫాజిల్ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నడని తెలుస్తోంది.
దర్శకుడు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో నటి త్రిప్తి దిమ్రీ సరసన ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా బాలీవుడ్‌లో ఆయనకు తొలి సినిమా కావడం గమనార్హం. ఫహద్ 2017 సంవత్సరంలో స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ఎలెక్కారన్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో సూపర్ డ్యూలెక్స్, విక్రమ్, మామన్నన్ వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయ్యాడు.
తెలుగు, తెలుగు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించి పాపులర్ అయ్యాడు ఫహద్ ఫాజిల్. తెలుగులో పుష్ప సినిమా హిట్ అందుకున్నాడు. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2లో కూడా మెయిన్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాకు దాదాపు రూ.8 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం గమనార్హం. పుష్ప2 సినిమా సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో నటుడిగా అరంగేట్రం చేస్తున్న ఫహద్ ఇప్పుడు తన పారితోషికాన్ని పెంచేశాడు. ఇప్పటివరకు విలన్ పాత్ర కోసం అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచాడు ఫహద్ ఫాజిల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.