
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రభాస్ నటించిన సినిమాలని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత చేసిన సాహో సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయిన సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు సాలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఇక ఈ సినిమాకు కేజీఎఫ్ సినిమాకు లింక్ ఉందంటూ కొద్దిరోజులుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఇక సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఇప్పటికే చాలా సినిమాలు లైనప్ చేశాడు. సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరో దర్శకుడితో ప్రభాస్ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ త్రివిక్రమ్, ప్రభాస్ లతో సినిమా చేయాలనీ భావిస్తోందట. ఈ కాంబినేషన్ లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలని ప్లాన్ జరుగుతుందట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.