
మణిరత్నం.. సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షాదరణ అందుకున్నారు. ప్రేమ కథ చిత్రాలకు మణిరత్నం కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. మణిరత్నం సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అందమైన ప్రేమకథలు మాత్రమే కాదు సమాజానికి మెసేజ్ కూడా ఇస్తుంటాయి మణిరత్నం సినిమాలు. చివరిగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా మంచి విజయాన్ని అందికుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు ఈ స్టార్ డైరెక్టర్. పొన్నియన్ సెల్వన్ సినిమా తర్వాత మణిరత్నం కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు థగ్‌లైఫ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
ఈ సినిమా త్వరలోనే హిటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓ యంగ్ హీరోతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు తెలుగులో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి. తెలుగులో ఈ యంగ్ హీరో చేసిన సినిమాలు తక్కువే కానీ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆతర్వాత జాతిరత్నాలు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది. ఈ మూవీ తర్వాత నవీన్ ఓ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే ఈ యంగ్ హీరో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త నిజమైతే నవీన్ పోలిశెట్టి రేంజ్ పెరిగిపోవడం ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి