
ప్రస్తుతం పూరిజగన్నాథ్‌కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు. యూత్‌ను ఆకట్టుకునే కథలు, డైలాగ్స్ తో పూరి సినిమాలు చేస్తుంటారు. పూరి సినిమాలో హీరోల యాటిట్యూడ్ యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకుంటుంటాయి. పూరి మార్క్ డైలాగ్స్ బయట ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో పూరి తెరకెక్కించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.
ఇటీవలే పూరికి హీరో దొరికాడు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలుపెట్టేశాడు పూరి. ఈ సినిమాలో హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే, టబులాంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు అక్కినేని అందగాడు నాగార్జున. నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
నాగార్జున హీరోగానే కాదు ఇప్పుడు సహాయక పాత్రల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్. అలాగే ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలోనూ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నారు. ఇక ఇప్పుడు పూరి , సేతుపతి సినిమాలోనూ నాగ్ క్యామియో చేయనున్నారని అంటున్నారు. గతంలో పూరి నాగార్జున కాంబినేషన్ లో సూపర్, శివమణి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.