మృణాల్ ఠాకూర్.. తెలుగులో తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది ఈ అందాల భామ. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అందం అభినయంతో కట్టిపడేసింది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఆతర్వాత తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. ఆతర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న అనే సినిమా చేసింది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఆతర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఫ్యామిలి స్టార్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఈ చిన్నది మంచి క్రేజ్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మృణాల్ బాయ్ ఫ్రెండ్ ఇతడే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతను ఎవరో కాదు బాలీవుడ్ యంగ్ హీరో యువ హీరో సిద్ధాంత్ చతుర్వేది. అతనితో మృణాల్ డేటింగ్ చేస్తుందని టాక్ నడుస్తుంది.
తాజాగా ఈ ఇద్దరూ ఓ హోటల్ నుంచి బయటకు వస్తుండగా ఫొటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హగ్ ఇవ్వడంతో పాటు చేతులు పట్టుకుని బయటకు నడుచుకుంటూ వచ్చింది మృణాల్. దాంతో కుర్రాళ్ళ గుండెలు బద్దలయ్యాయి. ఈ అమ్మడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తుందని టాక్. ఈ ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని టాక్ లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. మృణాల్ ప్రస్తుతం తెలుగు, హిందీతో పాటు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుందని తెలుస్తోంది.
#siddhantchaturvedi being the true Gentleman for Mrunal ❤️✨ #mrunalthakur pic.twitter.com/n4zLhtI46T
— Viral Bhayani (@viralbhayani77) May 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.