
భారతీయ చిత్ర పరిశ్రమకు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ కంటే దక్షిణాది చిత్రాలు ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి ఎన్నో తెలుగు సినిమాలు వరల్డ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులను అలరించి భారీ కలెక్షన్లు రాబట్టాయి. ఇప్పుడు హాలీవుడ్ ప్రముఖులు కూడా భారతీయ చిత్రాలలో, ముఖ్యంగా దక్షిణాది చిత్రాలలో నటించడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే, ‘ది మమ్మీ’ ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లో విజయ్ దేవరకొండ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తమిళ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంతిరం’లో జేమ్స్ కాస్మో నటించారు. ఇప్పుడు మరో హాలీవుడ్ సూపర్ స్టార్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని టాక్ నడుస్తోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడీ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఒక హాలీవుడ్ స్టార్‌ను కూడా తీసుకోనున్నారని టాక్.
ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన నటుడు విల్ స్మిత్, అల్లు అర్జున్ రాబోయే చిత్రం ‘రాకా’లో కనిపించనున్నారని సమాచారం. అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించిన విల్ స్మిత్, హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ చిత్రంలో నటిస్తే రాకా చిత్రానికి మరింత క్రేజ్ వస్తుంది. ముఖ్యంగా హాలీవుడ్ మార్కెట్‌లో అల్లు అర్జున్ సినిమాకు భారీగా ప్రచారం వస్తుంది.
కాగా విల్ స్మిత్‌కు కూడా భారతీయ సినిమాలు కొత్తేమీ కాదు. ఆయన గతంలో 2019లో విడుదలైన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో నటించారు. ఆయన పలు సందర్భాల్లో భారతదేశాన్ని కూడా సందర్శించారు. కొన్ని నెలల క్రితం, విల్ స్మిత్ ఒక చిన్న వజ్రాల గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
RAAKA🚨: Reports claim that Hollywood actor & Oscar winner #WillSmith may shoot his portions during an overseas schedule after being approached to play the sci-fi epic’s antagonist opposite #AlluArjun. The buzz around #RAAKA is getting bigger and stronger @Atlee_dir 💥 pic.twitter.com/EGzgqEbpYs
— 𝗜𝗰𝗼𝗻 𝗧𝗲𝗷𝗔𝗔 👑🔥 (@tejaravi0053) August 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి