Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘దేవర’పై ఇంట్రెస్టింగ్ బజ్.. సలార్ సినిమాతో రానున్న తారక్..
ఇప్పుడు దేవర సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు నటిస్తోన్న సినిమా ‘దేవర’. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొమురం భీమ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు తారక్. దీంతో ఇప్పుడు దేవర సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువస్తున్నట్లు గతంలో డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు.
ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ మూవీపై ఆసక్తిని కలిగించాయి. దీంతో ఈ మూవీ టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు తారక్ ఫ్యాన్స్. తాజాగా ఈ మూవీ టీజర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు లేటేస్ట్ అప్డేట్ ప్రకారం డిసెంబర్ 25న లేదా జనవరి 1న విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా డిసెంబర్ 22న ప్రభాస్ నటించిన సలార్ చిత్రం.. అంతకు ముందు షారుఖ్ నటించిన డంకీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఈ సినిమాలతోపాటే సలార్ టీజర్ సైతం రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అటు డార్లింగ్ ఫ్యాన్స్..ఇటు తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే దీనిపై అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
Fear has a new name, and it’s #Devara 🔥.
Get ready to witness the most MASSIVE SHOW on the Big Screens in 150 days!
Counting down towards the #DevaraFrenzy. 💥 pic.twitter.com/CafxwMJsLN
— Devara (@DevaraMovie) November 7, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
