AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. ‘సలార్’ రన్ టైమ్ ఎంతంటే..

ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. చాలా కాలం ప్రభాస్ ఇందులో యాక్షన్ లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతుందడడంతో సలార్ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురాబోతున్నారు నీల్. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాదిలో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయనున్నారు.

Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు క్రేజీ అప్డేట్.. 'సలార్' రన్ టైమ్ ఎంతంటే..
Salaar
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2023 | 3:47 PM

Share

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ కోసం పాన్ ఇండియా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడే ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఆ తర్వాత విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ మాత్రం సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేశారు. చాలా కాలం ప్రభాస్ ఇందులో యాక్షన్ లుక్ లో కనిపించనున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతుందడడంతో సలార్ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురాబోతున్నారు నీల్. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాదిలో సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయనున్నారు.

భారీ అంచనాల మధ్య ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ ఈఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కానుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సలార్ సినిమా సెన్సార్ పూర్తైందని.. ఈ చిత్రానికి A సర్టిఫికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొత్తం రన్ టైం 2 గంటల 55 నిమిషాలు ఉంటుందని సమాచారం. అయితే వీటిపై సలార్ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో వైరలవుతుంది.

ప్రభాస్, నీల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్.. జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు అన్నదే ఈ సినిమా స్టోరీ లైన్ అని ఇటీవల నీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.