
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ కొడుతున్నాడు. ఇదే కోవలో అతను నటించిన మరో సినిమా తక్షకుడు. వినోద్ అనంతోజు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీకి పూర్తి భిన్నంగా తక్షకుడు తెరకెక్కింది. ప్రేమలు, ప్రతీకారం వంటి అంశాలతో ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందిందని సమాచారం. అందుకు తగ్గట్టే ఇటీవల రిలీజైన ఈ మూవీ టీజర్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఆనంద్ దేవరకొండ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీజర్ రిలీజ్ తర్వాత తక్షకుడు సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. తక్షకుడు మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ కళ్లులేని వాడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో నటించిన హీరోయిన్ గురించి ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. తక్షకుడు టీజర్ లో ఆమె కేవలం ఒక్క ఫ్రేములోనే కనిపించింది. అయినా తన లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. మరీ ఇంతకీ ఎవరీ బ్యూటీ?
తక్షకుడు మూవీలో నటిస్తోన్న హీరోయిన్ పేరు నితాన్సీ గోయల్. గతంలో ‘లాపతా లేడీస్’ వంటి ఆస్కార్ నామినేటెడ్ మూవీలో అమాయకపు చూపులతో అందరినీ ఫిదా చేసిందీ ఈ ముద్దుగుమ్మనే. అంతేకాదు తన క్యూట్ యాక్టింగ్ తో ఎన్నో అవార్డులు కూడా కొల్లగొట్టిందీ అందాల తార. దీని కంటే ముందు ఛైల్డ్ ఆర్టిస్ట్ గా పలు టీవీ సీరియల్స్ లో నటించింది నితాన్సీ. ‘విక్కీ డోనర్’, ‘ఎంఎస్ ధోని’, ‘ఇందు సర్కార్’ తదితర సినిమాల్లోనూ బాల నటిగా మెప్పించింది. ఇక ‘లాపతా లేడీస్’ (2024) మూవీ చేసేటప్పటికీ నితాన్సీ వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. దీని తర్వాత మైదాన్ మూవీలో యాక్ట్ చేసిందీ అందాల తార. ఇప్పుడు తక్షకుడు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయ్యిందీ ముద్దుగుమ్మ.
ఇక తక్షకుడు సినిమా విషయానికి వస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.