AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే రోజు 96 సార్లు కాల్ చేశా.. 97వ సారి ఫోన్ ఎత్తి అలా అనేసరికి.. బ్రేకప్ స్టోరీ చెప్పిన ఎక్స్‌ప్రెస్ హరి

పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్ ప్రెస్ హరి. అతని కామెడీ పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హరి తన బ్రేకప్ స్టోరీ చెప్పి అందరినీ ఏడిపించాడు.

ఒకే రోజు 96 సార్లు కాల్ చేశా.. 97వ సారి ఫోన్ ఎత్తి అలా అనేసరికి.. బ్రేకప్ స్టోరీ చెప్పిన ఎక్స్‌ప్రెస్ హరి
Express Hari
Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 3:57 PM

Share

ఎక్స్ ప్రెస్ హరి.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అతను పటాస్ షోతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీషోతో మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు తదితర టీవీ ఛానెన్స్ లోని పలు ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు హరి. ఈ సంగతి పక్కన పెడితే.. ఎక్స్ ప్రెస్ హరి బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డితో ప్రేమలో ఉన్నాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది. అంతేకాదు అషు పేరును పచ్చబొట్టుగా కూడా వేయించుకున్నట్లు తెలిసింది. అలాగే హరికి ఆషు రెడ్డి బైక్ గిఫ్ట్ గా ఇవ్వడం వంటివి చూసి నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే అదంతా నిజం కాదని, షో కోసమే అలా చేశారని తెలిసింది. ఇదిలా ఉంటే పలు టీవీ షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటోన్న ఎక్స్ ప్రెస్ హరి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే సమయంలో తన బ్రేకప్ స్టోరీని కూడా బయట పెట్టాడు.

‘నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. అయితే ఆమె నన్ను మోసం చేసింది. ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. సూసైడ్ కూడా చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. ప్రేమకు ఎంత పవర్ ఉందో నాకు అప్పుడే తెలిసింది. ఒకరోజు అమ్మాయి నాతో మాట్లాడకపోతే తట్టుకోలేకపోయాను. ఒక రోజు తనకు 96 మిస్డ్ కాల్స్ ఇచ్చాను. 97వ సారి ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని మాట్లాడింది. ఓసారి విశాఖ పట్నం వస్తాను నన్ను కలవమని చెప్పింది. ఆమె చెప్పిన లోకేషన్ కు వెళ్లాను. తన కోసం గంటల తరబడి ఎదురుచూసినా రాలేదు. తీరా ఫోన్ చేస్తే నేను అక్కడ లేను అంటూ మాట్లాడింది. ఆమె కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను. కానీ ఆ క్షణం అనిపించింది.. నేనంటే ఇష్టం లేని వారి కోసం తానెందుకిలా అయిపోవాలి అనిపించింది. ఆ టైంలో నేరుగా గుడికి వెళ్లి అక్కడ కాసేపు కూర్చొని బాగ ఏడ్చేశాను. ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోయానని. ఇలా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సంఘటన మనకు ఒక గుణపాఠం లాంటిదే’ అంటూ హరి తన ఆవేదనను పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎక్స్ ప్రెస్ హరి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. అయితే అతనిని మోసం చేసిన అమ్మాయి ఎవరు? ఏంటి? అన్న విషయాలను మాత్రం ఎక్కడా బయట పట్టలేదీ జబర్దస్త్ కమెడియన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం