Raviteja: ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మహారాజా సినిమా ఫిక్స్.. రవితేజ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ?..

కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించగా.. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం మాస్ మాహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వర్ కథానాయికగా కనిపించనుండగా..యంగ్ హీరో నవదీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.

Raviteja: ఆ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో మాస్ మహారాజా సినిమా ఫిక్స్.. రవితేజ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ ?..
Anudeep, Raviteja

Updated on: Nov 26, 2023 | 9:11 AM

హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇటీవలే టైగర్ నాగేశ్వర రావు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు రవితేజ. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో నుపూర్ సనన్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ఈగల్ చిత్రంలో నటిస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ క్యూరియాసిటిని కలిగించగా.. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా కోసం మాస్ మాహారాజా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో కేరళ కుట్టి అనుపమ పరమేశ్వర్ కథానాయికగా కనిపించనుండగా..యంగ్ హీరో నవదీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇటు ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే మరిన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేశారు మాస్ మహారాజా.

ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చిత్రీకరణలో ఉన్న డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారట. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మాస్ మహారాజా రవితేజ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో చేయబోతున్నారట.

ఇప్పటికే జాతిరత్నాలు , ప్రిన్స్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న అనుదీప్. ఇప్పుడు రవితేజతో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే రవితేజకు స్టోరీ లైన్ వినిపించారని.. కథ నచ్చడంతో రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసే పనిలో ఉన్నారట అనుదీప్. త్వరలోనే వీరిద్దరి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందని.. అతి త్వరలోనే ఈమూవీ పట్టాలెక్కనుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.