
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ను ప్రేక్షకులకు అందించి అలరిస్తుంది. ఇప్పటికే తెలుగు ఓటీటీల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆహా. సూపర్ హిట్ సినిమాలు, అదిరిపోయే వెబ్ సిరీస్ లు, ఆకట్టుకునే గేమ్ షోలు, టాక్ షోలతో మెప్పిస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, సంగీతప్రేమికుల నుంచి ప్రశంసలు పొందింది సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే మూడు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో నాలుగో సీజన్ కోసం రెడీ అవుతుంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కోసం ఎదురు చూస్తోన్న ప్రయాణం ఘనంగా ప్రారంభమైంది. ఎంతో టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురుచూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకువచ్చారు నిర్వాహకులు. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించిన సీజన్ 1 పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండియన్ ఐడల్ 2కు వచ్చిన అపూర్వమైన స్పందనవచ్చింది.
అలాగే సీజన్ 3కూడా అంతే పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు సీజన్ 4కు సమయం వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. సెలెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి..హోస్ట్ ఎవరు, జడ్జెస్ ఎవరు.? ఏ సెలెబ్రిటీ వచ్చి ఈ సీజన్ ని గ్రాండ్ లాంచ్ చేస్తారో అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సీజన్ 4కు కూడా తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మరో జడ్జ్ కూడా ఉండనున్నారు.
తాజాగా సీజన్ 4 ఆడిషన్ ను ఏర్పాటు చేయనున్నారు నిర్వాహకుల. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 గ్రాండ్ ఆడిషన్ ను ఆగస్టు 3న నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని రిషి ఎమ్ఎస్ ఇంస్టిటయిట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఉమెన్స్ కాలేజ్ లో ఈ ఆడిషన్స్ జరగనున్నాయి. సింగింగ్ పై ఫ్యాషన్ ఉన్న సింగర్స్ ఆడిషన్స్ లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోండి. తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ సింగర్స్ తమ ప్రతిభను చాటారు. మారేందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆడిషన్స్ లో పాల్గొంది మీ ప్రతిభను బయట పెట్టండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.