Ileana Food Business: ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న గోవా బ్యూటీ.. లాక్‌డౌన్ త‌ర్వాత‌.?

|

May 18, 2021 | 9:13 AM

Ileana Food Business: సెల‌బ్రిటీలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. సినిమా నుంచి క్రికెట్ ప్లేయ‌ర్స్ వ‌ర‌కు ఏదో స‌మ‌యంలో వ్యాపారంలోకి దిగాల్సిందే. కెరీర్ పీక్‌లో ఉన్న స‌మ‌యంలోనే..

Ileana Food Business: ఫుడ్ బిజినెస్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న గోవా బ్యూటీ.. లాక్‌డౌన్ త‌ర్వాత‌.?
ఇక్కడ రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్  చెక్కేసింది కానీ అక్కడ అనుకున్నంతగా ఆఫర్లు పలకరించలేదు. ఆతర్వాత లవ్ , బ్రేకప్, డిప్రషన్, బరువు పెరగడం ఇలా చకచకా అన్ని జరిగిపోయాయి. 
Follow us on

Ileana Food Business: సెల‌బ్రిటీలు వ్యాపార రంగంలోకి అడుగుపెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన విష‌యం. సినిమా నుంచి క్రికెట్ ప్లేయ‌ర్స్ వ‌ర‌కు ఏదో స‌మ‌యంలో వ్యాపారంలోకి దిగాల్సిందే. కెరీర్ పీక్‌లో ఉన్న స‌మ‌యంలోనే నాలుగు పైస‌లు వెనకేసుకున్న వారు అనంత‌రం త‌మ‌కు తోచిన బిజినెస్‌లు ప్రారంభిస్తుంటారు. స్వ‌త‌హాగా సెలబ్రిటీలు కావ‌డంతో వారి వ్యాపారాల‌కు ప్రత్యేకంగా ప్ర‌మోష‌న్‌లు అవ‌స‌ర లేదు.
వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సినీతార‌ల జాబితాలో గోవా బ్యూటీ ఇలియానా కూడా వ‌చ్చి చేరారు. ఒక‌ప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ వ‌ర‌సు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా గ‌డిపిన‌ ఇల్లీ బేబీ తాజాగా పెద్ద‌గా సినిమా అవకావాలు ద‌క్కించుకోలేక వెన‌క‌బ‌డింది. యంగ్ హీరోయిన్ల రేసులో నిల‌వ‌లేక‌పోయింది. దీంతో ఇలియానా తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్ట‌నున్నట్లు బాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బేక‌రీ, రెస్టారెంట్ వంటి వ్యాపారం చేయాలో ఆలోచ‌న‌లో ఇలియానా ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా వ్యాపార ప్రారంభం కోసం మ‌రికొంత స‌మ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఇలియానా త‌న బిజినెస్ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుందని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read: Sushil Kumar: రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ ప్రకటించిన ఢిల్లీ పోలీసులు!

Oxygen: నేపాల్‌కు భారత్ చేయూత.. ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అంగీకారం..

Tirumala: మృతిచెందిన యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు.. చూసి నివ్వెరపోయిన అధికారులు..