ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. మెగా ఫ్యామిలి నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బన్నీ, నటన, డాన్స్ , డైలాగ్ డెలివరీ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. బన్నీ స్టార్ హీరోగానే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరో అని చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. అల్లు అర్జున్. కష్టాల్లో ఉన్న వారికి ఉదారంగా సాయం చేస్తూ అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటూనే ఉంటున్నారు. ఇక ఇప్పటికే కేరళలో ఓ పేద విద్యార్థి చదువుకు సాయం చేసిన బన్నీ.. తాజాగా తన డ్రైవర్‌ను కూడా ఆదుకున్నారు.
అల్లు అర్జున తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఓ .మహిపాల్ ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన ఓ మహిపాల్ 10ఏళ్లుగా అల్లు అర్జున్ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ బోరబండలో నివాసం ఉంటున్న మహిపాల్ ఇటీవలే ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాడు.
ఈవిషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మొత్తం 15లక్షల రూపాయలు మహిపాల్‌కు చెక్కుల ద్వారా ఇచ్చాడు. 10లక్షల చెక్కు ఒకసారి, 5లక్షల చెక్కు ఒకసారి ఇచ్చాడు. అల్లు అర్జున్, భార్య స్నేహరెడ్డి ఇద్దరు జాయింట్ అకౌంట్ నుంచి 15లక్షలు తన డ్రైవర్ ఇల్లు నిర్మాణానికి ఇచ్చి తన ఉదారతను చాటుకుంటున్నాడు.