Allu Arjun : నాకు సినిమా నచ్చకపోతే మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడను.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం". గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు.

Allu Arjun : నాకు సినిమా నచ్చకపోతే మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడను.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్..
Bunny

Updated on: Nov 01, 2021 | 9:40 AM

Pushpaka Vimanam: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న “పుష్పక విమానం” చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో “పుష్పక విమానం” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్పక విమానం ట్రైలర్ చాలా బాగుంది. నేను రిలీజ్ చేయకున్నా ఇదే విషయం ట్వీట్ చేసేవాడిని అన్నారు. పుష్పక విమానం ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ తెలుసు నాకు సినిమా నచ్చకుంటే ఆ సినిమా ఫ్రెండ్స్ సినిమా అయినా, మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడను. నచ్చితే మాత్రం వీలైనంత
సపోర్ట్ చేస్తుంటా. పుష్పక విమానం సినిమా ట్రైలర్ చూశాక..సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా విజయవంతం అవుతుందనే వైబ్స్ తెలుస్తున్నాయి. అందుకే ఈ టీమ్ కు ఆల్ ద బెస్ట్ కాకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నాను. విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం. అతను సెల్ఫ్ మేడ్ యాక్టర్. నటుడిగా ఎవడే  సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి..ఇలా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తాను. విజయ్ ఎదుగుదల నా విజయం అనుకుంటాను. అతనికి పేరొస్తే సంతోషించే వాళ్లలో నేనూ ఉంటాను అన్నారు.

. నువ్వూ ఇంకా పేరు తెచ్చుకుంటాడని నమ్మకముంది. విజయ్ కు మంచి మనసు, మేధస్సు ఉన్నాయి. పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్లు అందరితో సరదాగా ఉండలేరు. కానీ విజయ్ ఇంటెలిజెంట్ అయినా స్నేహంగా, కలుపుగోలుగా ఉంటాడు . విజయ్ లా ఇంత తక్కువ టైమ్ లో స్టార్ అయిన నటుడిని చూడలేదు. విజయ్ తన
సినిమాల ఫలితం ఎలా ఉన్నా, విభిన్నమైన సినిమాలే చేస్తాడు. విజయ్ నాకు పంపే రౌడీ క్లోత్స్ చాలా ఇష్టం అంటూ ఆకాశానికెత్తేశాడు బన్నీ. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మీరు సొంత ప్రొడక్షన్ పెట్టడం నిజంగా మంచి విషయం. ఎంతోమంది టాలెంట్ పీపుల్ కు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉండదా..
అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారు. నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి ఇన్స్ పైర్ అవ్వాలి గానీ అసూయ పడొద్దని చెప్పా. అలా విజయ్ ఎదుగుతుంటే అతన్ని చూసి నేనూ స్ఫూర్తిపొందుతా. అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి కూడా. పుష్పక విమానం సినిమాతో మీరు హిట్ కొట్టారనే అనుకుంటున్నా. కోవిడ్ టైమ్ లో రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mehreen Pirzada: ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా సినిమాలు చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మెహ్రీన్..

Bommarillu Bhaskar‌: మరో మెగా పవర్ ఆఫర్ కొట్టేసిని బొమ్మరిల్లు భాస్కర్‌.. ఇది నిజమేనా అంటున్న అభిమానులు.. (వీడియో)

Anubhavinchu Raja: ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి హాయిగా నవ్వుకునే సినిమా మాది: రాజ్ తరుణ్