AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBOMMA: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. సడెన్‌గా ప్రత్యక్షమైన వెబ్ సైట్!

చాలా కాలంగా నిలిచిపోయిందనుకున్న ఐబొమ్మ వెబ్‌సైట్ మళ్లీ యాక్టివ్ కావడం సంచలనంగా మారింది. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే సైట్‌లో ప్రత్యక్షమవుతుండటంతో మరోసారి పైరసీ చర్చ మొదలైంది. గతంలో అరెస్టైన ఇమంది రవి ప్రస్తుతం బెయిల్‌పై ఉండగా.. ఈ వెబ్‌సైట్‌ను ఇప్పుడు ఎవరు నిర్వహిస్తున్నారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

iBOMMA: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది..  సడెన్‌గా ప్రత్యక్షమైన వెబ్ సైట్!
Ibomma
Rakesh Reddy Ch
| Edited By: |

Updated on: May 13, 2026 | 11:22 AM

Share

ఐ బొమ్మ వెబ్ సైట్ మళ్లీ యాక్టివ్ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.  ఇప్పుడు మళ్లీ ఎవరు మొదలు పెట్టారు?.. పోలీసులు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నా.. దాన్ని మళ్లీ ఎందుకు యాక్టివ్ చేశారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెట్టింట సంచలనం రేపుతున్న ఐబొమ్మ వెబ్ సైట్ మళ్లీ వచ్చేసింది. సినిమా విడుదలైన గంటల్లోనే కొత్త సినిమాలు ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పరిణామం ఇప్పుడు సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గతంలో ఈ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ అవుతున్న పైరసీ సినిమాల వ్యవహారంలో ఇమంది రవి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టుతో ఈ వెబ్ సైట్ వ్యవహారానికి పూర్తిగా బ్రేక్ పడిందని అంతా భావించారు.  రవి అరెస్ట్ అయినప్పటి నుంచి ఐ బొమ్మ వెబ్ సైట్‌లో ఎలాంటి ఆక్టివిటీ లేదు. తమ కార్యకలాపాలు ఆపేస్తున్నట్లు ఆ వెబ్‌సైట్ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఈ సైట్ కథ ముగిసిందని అనుకున్నారు.  అయితే, కేసుల నేపథ్యంలో గతంలో అరెస్ట్ అయిన రవి ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఆయన ప్రస్తుతం బయట ఉండటం ఈ వ్యవహారంలో కీలక ఘట్టం.

రవి బెయిల్‌పై ఉన్న ఈ సమయంలోనే, సడెన్‌గా ఐ బొమ్మ వెబ్ సైట్ మళ్లీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  అంతేకాకుండా యాక్టివిటీ లేని ఈ వెబ్ సైట్ నుంచి ఇప్పుడు మళ్లీ వరుసగా కొత్త సినిమాలు రావడం మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇప్పుడు ఈ ఐ బొమ్మ వెబ్ సైట్ ను మళ్లీ ఎవరు మొదలు పెట్టారు అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.

బెయిల్‌పై ఉన్న రవికి ఇందులో ఏమైనా ప్రమేయం ఉందా, లేక తెర వెనుక ఇంకెవరైనా ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.  ఏది ఏమైనా.. చాలా కాలంగా ఆగిపోయిన ఐ బొమ్మ వ్యవహారం ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడం, సడెన్ గా వెబ్ సైట్ ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
ఉగ్ర దావానలంలో పాకిస్థాన్:నెల రోజుల్లో ఎంతమంది సైన్యం చనిపోయారంటే
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
కలలో మురికి లేదా చిరిగిన బట్టలు కనిపిస్తున్నాయా?ఇది శుభమా? అశుభమా
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..!
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీపై కీలక అప్డేట్
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
ఇంట్లో జంట పాముల ఫోటో ఉందా? వాస్తు ప్రకారం ఈ దిశలో ఉంచితే శుభ..
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
తెల్ల అన్నం తింటే నిజంగానే లావవుతారా? రోజూ బ్రౌన్‌ రైస్‌ తినొచ్చా
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
ఛీ..నువ్వు తల్లివేనా.. మద్యం మత్తులో చిన్నారిని ఏం చేసిందంటే?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
టీమిండియాలోకి దేశవాళీ సంచలనం ఎంట్రీ.. ఎందుకో తెలుసా?
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..
శానిటరీ ప్యాడ్ కొనే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి..