Ramabanam: రామబాణం నుంచి ‘ఐఫోన్’ సాంగ్ రిలీజ్.. జానపద బాణీలో హుషారెత్తిస్తోన్న మాస్ బీట్..

|

Apr 06, 2023 | 8:44 PM

తాజాగా ఈ మూవీ నుంచి మాస్ బీట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఐఫోన్ అంటూ సాగుతున్న ఆ జానపద మాస్ బీట్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా.. రామ్ మిర్యాల.. మోహన భోగరాజు ఆలపించారు. జానపద బాణీలో మాస్ బీట్ తో ఈ పాట విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

Ramabanam: రామబాణం నుంచి ఐఫోన్ సాంగ్ రిలీజ్.. జానపద బాణీలో హుషారెత్తిస్తోన్న మాస్ బీట్..
I Phone Song
Follow us on

మ్యాచో హీరో గోపిచంద్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శ్రీవాస్ తెరకెక్కిస్తోన్న లేటేస్ట్ చిత్రం రామబాణం. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్ కావడంతో.. ఇప్పుడు ఈ సినిమా పై కూడా క్యూరియాసిటీ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మాస్ బీట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఐఫోన్ అంటూ సాగుతున్న ఆ జానపద మాస్ బీట్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా.. రామ్ మిర్యాల.. మోహన భోగరాజు ఆలపించారు. జానపద బాణీలో మాస్ బీట్ తో ఈ పాట విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

శ్రీవాస్.. గోపిచంద్ కాంబోలో రాబోతున్న ఈ మూడవ చిత్రం డింపుల్ హయతి కథానాయికగా నటిస్తుండగా.. ఇందులో జగపతి బాబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో గోపిచంద్, జగ్గూ భాయ్ ఇద్దరు అన్నదమ్ములుగా నటించనున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా వీరిద్దరికి సంబంధించి విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది. అందులో ఇద్దరూ వైట్ పంచలు కట్టుకొని.. తలకు పాగా చుట్టి నుదుటిన కుంకుమ విభూది ధరించి హుందాగా కనిపించరు. ఈ సినిమాను భారీ స్థాయిలో మే 5న రిలీజ్ చేయనున్నారు. సచిన్ ఖేడ్కర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య ఇతరపత్రాల్లో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ కంపెనీ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిచంది. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.