ఆయన నాకు 50లక్షల సాయం చేశారు.. సుధీర్, గెటప్ శ్రీను ఇళ్లు కొనుక్కోవడానికి ఆయనే కారణం: హైపర్ ఆది

ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్. సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయ్యింది. కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి. ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది దర్శకులుగా మారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు

ఆయన నాకు 50లక్షల సాయం చేశారు.. సుధీర్, గెటప్ శ్రీను ఇళ్లు కొనుక్కోవడానికి ఆయనే కారణం: హైపర్ ఆది
Sudheer Getup Srinu

Updated on: Jan 02, 2026 | 1:22 PM

జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. కొందరు కమెడియన్స్ గా, దర్శకుడిగా, హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇక సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీతో టాప్ కమెడియన్ గా మారాడు. అలాగే సినిమాల్లోనూ తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు హైపర్ ఆది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మల్లెమాల నిర్మాణ సంస్థకు తామే జీవితాన్ని ఇచ్చింది అనే వాదనను హైపర్ ఆది తీవ్రంగా ఖండించారు. నిజానికి మల్లెమాల జబర్దస్త్ కార్యక్రమమే తమ అందరికీ జీవితాన్ని ప్రసాదించిందని, ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదని ఆయన అన్నారు. ఈ వాదనను తిరస్కరిస్తే అది మూర్ఖత్వమే అవుతుందని ఆది చెప్పుకొచ్చారు. మల్లెమాల అధినేత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి గొప్పతనాన్ని గురించి వివరిస్తూ..

ఆయన ఎం.ఎస్. రెడ్డి కుమారుడని, అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అని గుర్తుచేశారు. అంతేకాకుండా, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, కోట్ల విజయభాస్కర రెడ్డికి అల్లుడు అని కూడా తెలిపారు ఆది. ఎస్.ఎస్. రాజమౌళి, కొరటాల శివ వంటి ప్రముఖ దర్శకులు సైతం తమ సినిమా ఓపెనింగ్‌లప్పుడు ఆయన్ను పిలిచి క్లాప్ కొట్టించి గౌరవిస్తారని, అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడటం సరైనది కాదని ఆది అన్నారు. కొంతమంది చేస్తున్న “బానిసల్లా బతుకుతున్నారు” అనే ఆరోపణలను కూడా ఆది ఖండించారు. మల్లెమాల సంస్థ ఆర్థికంగా తమకు ఎంతో అండగా నిలిచిందని ఆది గుర్తు చేసుకున్నారు. తనకు, రామ్ ప్రసాద్‌కు, రష్మికి, సుధీర్‌కు, గెటప్ శ్రీనుకు ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు లక్షలాది రూపాయలు ముందుగానే చెల్లించి సహాయం చేశారని వివరించారు. నాకు, అభి అన్నకు 40-50 లక్షల వరకు ఆర్థిక సాయం అందింది. అలాగే సుధీర్, గెటప్ శ్రీను వంటి వారు కూడా ఈ సహాయంతో ఇళ్లు కొనుక్కున్నారు అని ఆది  చెప్పుకోచ్చాడు.

రష్మి విషయంలో మల్లెమాల సంస్థ ఈ అమ్మాయి మా అమ్మాయి అని హామీ ఇవ్వడం వల్ల ఆమెకు ఇల్లు కట్టుకోగలిగింది.  ఇది ఎంత గొప్ప సహాయమో అర్థం చేసుకోవాలని ఆది వివరించారు. సుధీర్ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడానికి గల కారణాలను కూడా ఆది స్పష్టం చేశారు. ఆర్పీ వంటి వారు ఆరోపిస్తున్నట్లుగా సుధీర్‌ను అవమానించి బయటకు పంపలేదని, అది అవాస్తవమని తెలిపారు.  సుధీర్ వాస్తవానికి రెండు సంవత్సరాల క్రితమే వెళ్ళిపోవాల్సింది, కానీ మా స్నేహం కోసం, మళ్ళీ కలిసి చేద్దామని చెప్పి అటు నుండి పిలిచినా సరే వెళ్ళలేదు అని ఆది వెల్లడించారు. సుధీర్ సినిమాల్లో హీరో అవ్వడంతో అతనికి ఆర్థికంగా ఎక్కువ అవసరాలు ఏర్పడ్డాయని, మల్లెమాల కంటే ఇతర ఛానెల్‌ల నుండి మంచి ఆఫర్లు, యాంకర్ గా అవకాశాలు వచ్చాయని ఆది తెలిపారు. సుధీర్ అటు ఇటు చేయాలనుకున్నప్పుడు, ఈ ఛానెల్ నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని, అందువల్లే అతను మంచి ఆర్థిక అవకాశాల కోసం వేరే ఛానెల్‌కు వెళ్ళాడని ఆది స్పష్టం చేశారు.  ఆర్పీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలని, సుధీర్‌కు మల్లెమాల పట్ల గౌరవం ఉందని ఆది చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.