ప్రముఖ సినీ నటులు, యాంకర్ల ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో షేర్ చేస్తోన్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు. యాంకర్ అనసూయ ఫిర్యాదు మేరకు అతనిపై354 (A)(D), 559 ఐపిసి సెక్షన్ 67 67(A) ఐ టి యాక్ట్ 2000 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడి వ్యవహారశైలిపై ఆమె ఈ నెల 17న సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నకిలీ ట్విటర్ ఖాతా నుంచి 267 హీరోయిన్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి పోస్టు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్‌లో పలువురు టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోస్ పెట్టి అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు.
నిందితుడు గతంలో దుబాయిలో మూడేళ్లపాటు ప్లంబర్ వర్క్ చేశాడు. ఆతర్వాత ఇండియాకు వచ్చి ఫిలిం ఇండస్ట్రీ యాంకర్స్ హీరోయిన్స్ టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నాడు. అనసూయ ఫిర్యాదు తో అప్రమత్తమైన పోలీసులు వెంటనే విచారణ చేపట్టి అతడిని పట్టుకున్నారు. అతడి ల్యాప్ టాప్ లో యాక్ట్రెస్ రోజా, అనసూయ, విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి ఫోటోలతో పోస్టులు ఉన్నట్లు తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..