Singer Mangli: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ.. 24 గంటలు గడవకముందే నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు మళ్లీ నెట్టింట తెగ మార్మోగిపోతోంది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె పాడిన బాయిలోన బల్లి పలికే పాట ను సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తోంది.

Singer Mangli: పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ.. 24 గంటలు గడవకముందే నిందితుడి అరెస్ట్.. ఏం జరిగిందంటే?
Singer Mangli

Updated on: Nov 27, 2025 | 6:16 PM

టాలీవుడ్ ఫోక్‌ సింగర్‌ మంగ్లీ పోలీసులన ఆశ్రయించింది.తనపై అసభ్యకర కామెంట్స్ చేసిన వ్యక్తిపై ఆమె గురువారం (నవంబర్ 27) ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటలు గడవక ముందే నిందితుడిని అరెస్ట్‌ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిని పోలీసులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మంగ్లీ పాడిన ‘బాయిలోన బల్లి పలికే’ పాటను విడుదల చేసింది. దీనికి ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్‌ వస్తోంది. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు కూడా ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే పాటకు 8 మిలియిన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి. అయితే ఈ పాట ఎంత వైరల్ అయ్యిందో అంతే విమర్శలు ఎదుర్కొంటోంది. కొందరు ఈ సాంగ్ లో వాడిన పదాలను కించ పరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే ‘మేడిపల్లి స్టార్’ అనే పేరుగల ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మంగ్లీపై అసభ్యకర కామెంట్స్ పెట్టాడు. ‘బాయిలోన బల్లి పలికే’ పాటను కించ పరుస్తూ వీడియో చేశాడు. ఇది కూడా నెట్టింట బాగా వైరలైంది. దీంతో సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది.

మేడిపల్లి స్టార్ అరెస్ట్..

మంగ్లీ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మేడిపల్లి స్టార్ ను అరెస్ట్ చేశారు. సైబర్‌ టెక్నికల్‌ టీం ఆధారంగా పోలీసులు నిందితుడి వివరాలు సేకరించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిందితుడు సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవాలనే ఉద్దేశంతో తరచూ ఇలాంటి వివాదాస్పద కంటెంట్ పోస్ట్ చేస్తుంటాడని తెలుస్తోంది. ఫన్, లైక్స్ కోసం సెలబ్రిటీలను ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తున్నాడని తేలింది. ‘మేడిపల్లి స్టార్’ చేస్తోన్న వీడియోలు సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని , అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

యూట్యూబ్ ను  షేక్ చేస్తోన్న మంగ్లీ బాయిలోనే బల్లి పలికే సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us