HIDIMBHA: తెలుగు తెరపై మరో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిడింబ’.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన అశ్విన్‌

అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం హిడింబ. అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయికగా నటించింది. గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్లు సినిమాపై అసక్తిని పెంచాయి.

HIDIMBHA: తెలుగు తెరపై మరో ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ హిడింబ.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన అశ్విన్‌
Hidimba Movie

Edited By: Ram Naramaneni

Updated on: May 28, 2023 | 11:59 AM

ఓంకార్‌ సోదరుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు అశ్విన్‌ బాబు. జీనియస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అతను జత కలిసే, రాజుగారి గది సినిమాతో హీరోగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నాడు. ఆతర్వాత నాన్న నేను నా బాయ్‌ ఫ్రెండ్స్‌, రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలతో నటుడిగా మరొక మెట్టు పైకెదిగాడు. ఇక అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం హిడింబ. అనిల్‌ కన్నెగంటి తెరకెక్కించిన ఈ ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌లో నందితా శ్వేత కథానాయికగా నటించింది. గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమాను అనిల్‌ సుంకర సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, టీజర్లు సినిమాపై అసక్తిని పెంచాయి. ఇక తాజాగా విడుదలైన హిడింబి ట్రైలర్‌ అయితే నెక్ట్స్‌లెవెల్‌లో ఉంది. ట్రైలర్ లో చూపించిన ఎలిమెంట్స్, యాక్షన్‌ సీక్వెన్సే ఈ హైప్‌ కు కారణం. 1908 టైంలో వే ఆఫ్ బెంగాల్ లో ఒక పడవలో కొందరు ఖైదీలను పట్టుకు వచ్చి అక్కడ వదిలేయడం, తర్వాత సముద్రంలో పుర్రెలు కనిపించడంతో మొదలైన కథ.. ఆ తర్వాత నేరుగా సిటీకి చేరుకుంటుంది. అక్కడ కొందరు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి చంపేయడం.. వారిని పట్టుకునేందుకు హీరో అశ్విన్‌, హీరోయిన్‌ నందితలు రంగంలోకి దిగడం.. ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగింది హిడింబి ట్రైలర్‌.

ఇంటెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌కు పీరియాడికల్‌ టచ్ ఇచ్చి తెరకెక్కించిన హిడింబ సినిమాలో పోలీస్‌ కాప్‌గా నటించాడు అశ్విన్‌. ఇక ట్రైలర్‌లో చూపించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టాడీ యంగ్‌ హీరో. అలాగే నటనలోనూ ఎంతో వైవిధ్యం చూపించాడు. ట్రైలర్‌తోనే ఎంతో ఆసక్తిని రేకెత్తించిన హిడింబి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల నిర్వహించిన హిడింబా ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్బంగా సినిమా సూపర్‌ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ మూవీ యూనిట్‌కు బెస్ట్‌ విషెస్‌ తెలిపాడు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..