Singer K.S. Chitra: సింగర్ చిత్ర పేరుతో ఘరానా మోసం.. పోలీసులను ఆశ్రయించిన గాయని..

|

Oct 14, 2024 | 12:48 PM

ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు, ఫోటోలతో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు కావాలని ఫాలోవర్లకు ఫేక్‌ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎప్పటికప్పుడు తమ అభిమానులను హెచ్చరిస్తున్నారు సెలబ్రెటీలు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Singer K.S. Chitra: సింగర్ చిత్ర పేరుతో ఘరానా మోసం.. పోలీసులను ఆశ్రయించిన గాయని..
Singer Ks Chitra
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సైబర్ మోసాల పెరిగిపోతున్నాయి. బెట్టింగ్, ట్రేడింగ్‏లో అధిక లాభాలు వస్తాయని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు, ఫోటోలతో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు కావాలని ఫాలోవర్లకు ఫేక్‌ మెసేజ్‌లు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎప్పటికప్పుడు తమ అభిమానులను హెచ్చరిస్తున్నారు సెలబ్రెటీలు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా సింగర్ చిత్ర కూడా తన పేరుతో నెట్టింట జరుగుతున్న మోసాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. తన పేరు, ఫొటోతో సహా సోషల్‌మీడియా ద్వారా డబ్బులు కావాలని ఫేక్‌ మెసేజ్‌లు చేస్తున్నారని గాయని కెఎస్‌ చిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక పథకానికి తాను అంబాసిడర్‌గా ఉంటానని, రూ.10,000 పెట్టుబడి పెడితే వారంలోపే రూ.50,000 వస్తాయని, ఐఫోన్ సహా బహుమతుల కోసం ఎదురుచూడాలని తప్పుడు వాగ్దానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొంది.

తన పేరు, ఫోటో ఉపయోగించి నకిలీ ఫేస్ బుక్ ఖాతా పెట్టుబడిని సృష్టించి జనాలకు తప్పుడు సందేశాలు పంపిస్తున్నారని.. ఆ మెసేజ్ వచ్చిన చాలా మంది ఈ అకౌంట్ చిత్రదా అంటూ ప్రశ్నించగా అవును అంటూ సదరు ఫేక్ అకౌంట్ రిప్లై ఇచ్చిందని.. అలాగే మరికొందరిని నమ్మిస్తూ మెసేజ్ లు చేసినట్లు తెలుస్తోంది. తన అభిమానుల ద్వారా విషయం తెలుసుకున్న సింగర్ చిత్ర తన పేరుతో జరుగుతున్న మోసాన్ని గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. చిత్ర ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ విభాగం ఐదు ఖాతాలను క్లోజ్ చేసినట్లు చిత్ర తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలతోపాటు టెలిగ్రామ్ ద్వారా కూడా ఈ ఫేక్ మెసేజ్ లు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారని తెలిపింది.

తన పేరుతో వస్తోన్న ఫేక్ మెసేజ్, ఫేక్ అకౌంట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అభిమానులకు సూచించింది చిత్ర. ఇలాంటి సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.