
హోంబలే ఫిలిమ్స్.. తక్కువ సమయంలోనే బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ నిర్మాణ సంస్థ స్టార్ హీరోల సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కన్నడ సినిమాలకు మార్కెట్ లేదు. పరిమిత బడ్జెట్‌తో మాత్రమే సినిమాలు నిర్మించాలనే చర్చ నడుస్తున్న సమయంలో, ఈ నిర్మాణ సంస్థ ఊహించని బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించడమే కాకుండా, దేశవ్యాప్తంగా కన్నడ చిత్రాలను పరిచయం చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏడాదికేడాది తన పరిధిని విస్తరిస్తున్న హోంబాలే ఫిల్మ్స్, ఇప్పుడు మలయాళం, తెలుగు , తమిళంతో పాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 , కాంతార, సలార్ సినిమాలతో హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులను అందించాడని రెడీ అవుతుంది.
కొన్ని నెలల క్రితం, హోంబలే ఫిల్మ్స్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూడు సినిమాలను ప్రకటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తోనూ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. తాజాగా ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసింది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 7 సినిమాలు తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మహావతార్: నరసింహ (25 జులై 2025), మహావతార్ : పరశురామ్ (2027), మహావతార్ : రఘునందన్ (2029), మహావతార్ : ద్వారకాదీశ్ (2031), మహావతార్ : గోకులానంద్ (2033), మహావతార్ : కల్కి 1 (2035), మహావతార్ : కల్కి 2 (2037) సినిమాలను అనౌన్స్ చేసింది హోంబలే ఫిలిమ్స్.
మహావతార విశ్వం’లోని విష్ణువు అవతారాల ఆధారంగా హోంబాలే చిత్రాలను నిర్మించనుంది. అయితే ఈ చిత్రాలన్నీ యానిమేటెడ్ సినిమాలా..? లేక చలనచిత్రాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘మహావతార విశ్వం’ను ప్రకటిస్తూ హోంబాలే మేకర్స్ మాట్లాడుతూ.. ‘అవకాశాలు అంతులేనివి. మా పాత్రలు తెరపై గర్జించడం చూడటానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. అద్భుతమైన సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. త్వరలోనే సలార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది హోంబలే ఫిలిమ్స్.
#MahavatarNarasimha’s audio rights have been acquired by @thinkmusicindia.
The musical journey begins with the First Single, releasing TODAY at 5:55 PM 🎵💥A @SamCSmusic musical 🎹#Mahavatar #Mahavatartales @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/mnhzuv2U53
— Hombale Films (@hombalefilms) June 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి