
‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఇప్పుడు పాన్ వరల్డ్ ఇమేజ్ పై దృష్టి సారించాడు. అందుకే ఇప్పుడు ఓ సూపర్ హీరో తరహా మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అందా తార దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ పవర్ హౌస్ గా పిలువబడే అలెగ్జాండ్రా విక్సోంటి అల్లు అర్జున్-అట్లీ సినిమాలో జాయిన్ అయ్యారు. మరి ఇంతకీ ఈ అలెగ్జాండ్రియా ఎవరు?
అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ చేయడానికి హాలీవుడ్ స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. . ఈ క్రమంలోనే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ కనెక్ట్ మాబ్ సీన్ అల్లు అర్జున్ సినిమా కోసం పనిచేయనుంది. ఈ ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ ‘అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి’ మొదటిసారి ఇండియాకు వచ్చారు. ముంబైలో అల్లు అర్జున్, అట్లీని ఆమె కలుసుకున్నారు. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేయడంపై చర్చలు నిర్వహించారు. అలెగ్జాండ్రా విక్జోంటికి హాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. ఆమె గతంలో ‘అవతార్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’, ‘డ్యూన్’, ‘జురాసిక్ వరల్డ్’, ‘బార్బీ’ వంటి భారీ బడ్జెట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మార్కెటింగ్ చేసింది. హాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న అలెగ్జాండ్రియా ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ చిత్ర బృందంలో చేరారు. హాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని మార్కెటింగ్ చేసే బాధ్యతను అలెగ్జాండ్రాకు అప్పగించారు. అమెరికా, మెక్సికో, కెనడా, హాలీవుడ్ ప్రభావం ఉన్న ఇతర దేశాలలో అల్లు అర్జున్-అట్లీ చిత్రాన్ని అలెగ్జాండ్రా ప్రమోట్ చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ రేంజ్ లోనూ సత్తా చాటాలని బన్నీ కోరుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హాలీవుడ్‌లోని అత్యుత్తమ మార్కెటింగ్ నిపుణుల సహాయం కోరుతున్నాడు.
HOLLYWOOD’S LEADING MARKETING POWERHOUSE EXECUTIVE VISITS INDIA… #Hollywood‘s premier marketing agency, #ConnekktMobScene, has sent its Executive Vice President of Creative Content, #AlexandraEVisconti, on her first visit to #India.
For nearly two decades, #ConnekktMobScene… pic.twitter.com/Ph9ZX8SA9g
— taran adarsh (@taran_adarsh) August 25, 2025
హాలీవుడ్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ తరహాలో అల్లు అర్జున్- అట్లీ ప్రాజెక్టు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌లోని కొన్ని ఉత్తమ స్టూడియోలు, ప్రాంప్ట్ మేకర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అల్లు అర్జున్. అట్లీ ఇప్పటికే హాలీవుడ్ స్టూడియోలను సందర్శించారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.