ఫ్యాన్స్ కోసం.. స్నానం చేసిన నీటితో సబ్బులు తయారు చేయించిన హీరోయిన్.. పైగా లిమిటెడ్ ఎడిషన్
తమ అభిమాన హీరోల కోసం సినీ సెలబ్రెటీలు ఏదైనా చేస్తుంటారు. సెలబ్రెటీల పుట్టున రోజులకు సినిమా రిలీజ్ లకు అభిమానులు అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తూ ఉంటారు. అలాగే తమ ఫ్యాన్స్ కోసం కూడా కొన్ని చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా తాను స్నానం చేసిన నీటితో సబ్బులు తయారు చేయించింది.

సినీ సెలబ్రెటీలకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన నటుల కోసం ఫ్యాన్స్ చాలా చేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు ఫ్యాన్స్ కోసం సెలబ్రెటీలు కూడా చిత్ర విచిత్రమైనవి చేస్తుంటారు. కొంతమంది సెలబ్రెటీలు చేసే పనిలో అభిమానులను అవాక్ అయ్యేలా చేస్తుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ ఏకంగా తనను స్నానం చేసిన నీటితో ఏకంగా సబ్బునే తాయారు చేసి దాన్ని అమ్మకానికి ఉంచింది. అంతే కాదు లిమిటెడ్ ఎడిషన్ అంటూ ఆఫర్ కూడా ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆ ముద్దుగుమ్మ అందానికి ఫిదా కానీ కుర్రకారు ఉండరు. ఇంతకూ ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా.?
ఇది కూడా చదవండి : పుష్పలో షెకావత్ పాత్ర నేనే చేయాలి.. కానీ చివరి నిమిషంలో.. అసలు విషయం చెప్పిన హీరో
సిడ్నీ స్వీనీ.. ఈ చిన్నది ఓ హాలీవుడ్ నటి. ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఫ్యాన్స్ కోసం స్నానం చేసిన నీటిని నిల్వ చేసి మరీ వాటితో సబ్బు తయారు చేయించింది. ఇటీవల, సిడ్నీ Dr. Squatch అనే సబ్బు బ్రాండ్‌తో కలిసి సిడ్నీస్ బాత్ వాటర్ బ్లిస్ అనే లిమిటెడ్ ఎడిషన్ సబ్బును విడుదల చేసింది. ఇది సిడ్నీ స్వీనీ స్నానం చేసిన నీటితో తయారు చేశారు. ఈ సబ్బును ప్రకటించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సబ్బు జూన్ 6, 2025 నుండి అందుబాటులో ఉండనుంది.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
ఈ సబ్బు ధర 8 డీలర్స్ అలాగే ఇవి కేవలం 5,000లు మాత్రమే తాయారు చేశారు. ప్రతి సోప్ కు ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఆథెంటిసిటీ ఉంటుంది. ఇది జూన్ 6, 2025 నుండి డాక్టర్ స్క్వాచ్ వెబ్‌సైట్‌లో 8 డీలర్స్( మన కరన్సీలో రూ. 700)కి అందుబాటులో ఉంటుంది. అలాగే, 100 సబ్బులను గెలుచుకునేందుకు మే 29 నుండి జూన్ 4 వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక గివ్‌అవే కూడా నిర్వహిస్తున్నారు. ఈ సబ్బులో ఎక్స్‌ఫోలియేటింగ్ ఇసుక, పైన్ బార్క్ ఎక్స్‌ట్రాక్ట్, పైన్, డగ్లస్ ఫిర్, ఎర్తీ మాస్ వంటి సుగంధాలు ఉన్నాయి.
View this post on Instagram
సిడ్నీ స్వీనీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








