రజనీకాంత్​ ఇంటికి బాంబు బెదిరింపు అతడి పనే…!

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో.. చెన్నై పోలీసులు టెన్ష‌న్ ప‌డ్డ విష‌యం తెలిసిందే. గాలింపు అనంత‌రం అది ఫేక్​ కాల్ అని తెలియ‌డంతో..ఆ ఫోన్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌యత్నించారు పోలీసులు.

రజనీకాంత్​ ఇంటికి బాంబు బెదిరింపు అతడి పనే...!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 20, 2020 | 1:43 PM

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందంటూ గురువారం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో.. చెన్నై పోలీసులు టెన్ష‌న్ ప‌డ్డ విష‌యం తెలిసిందే. గాలింపు అనంత‌రం అది ఫేక్​ కాల్ అని తెలియ‌డంతో..ఆ ఫోన్ చేసిన వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌యత్నించారు పోలీసులు. దీంతో ఈ వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చింది. కడలూర్​ జిల్లా దగ్గ‌ర్లోని నెల్లికుప్పంకు చెందిన ఎనిమిదో తరగతి స్టూడెంట్ ఈ పని చేసినట్లు గుర్తించారు. బాలుడు మెంట‌ల్ హెల్త్ స‌రిగ్గా లేద‌ని పోలీసులకు విచార‌ణ‌లో తెలిసింది. మెడిక‌ల్ స్టేట్మెంట్స్ పరిశీలించిన అనంతరం అతడిని వదిలిపెట్టారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే..

ఈ గురువారం మధ్యాహ్నం ఓ గుర్తు తెలియని వ్యక్తి 108 నెంబర్‌కు ఫోన్‌ చేసి రజనీకాంత్ నివాసంలో బాంబు ఉందని చెప్పాడు. దీంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టి రజనీ ఇంటికి చేరుకున్నారు. అయితే కోవిడ్-19 వ్యాప్తి కార‌ణంగా వారిని ఇంట్లోకి అనుమతించలేదు కుటుంబ స‌భ్యులు. 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు పోలీసులు. ఆ త‌ర్వాత‌ సెక్యూరిటీ గార్డ్​ క్యాబిన్​, రజనీ ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టి..ఏమీ దొర‌క్క పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆపై విచార‌ణ‌లో వ‌చ్చింది ఫేక్ కాల్ అని నిర్దారించారు.