
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం . త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం కుమ్మేసింది. తొలి రోజే ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. గుంటూరు కారం సినిమాకు మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రాను రాను ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. అలాగే మహేష్ ఫ్యాన్స్ ఆయనను ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో త్రివిక్రమ్ అలా చూపించారు.
మహేష్ బాబు డాన్స్, యాటిట్యూడ్, డైలాగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చింది. నేటి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. అలాగే గుంటూరు కారం సినిమాను తెలుగుతో పాటు హిందీ వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది.
మహేష్ బాబుకు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో గుంటూరు కారం సినిమాను హిందీ వెర్షన్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక కుర్చీ మడతపెట్టి హిందీ సాంగ్ వైరల్ గా మారింది. కుర్చీ మడతపెట్టి అనే డైలాగ్ ను మాత్రం మారచకుండా.. మిగిలినదంతా హిందీలో ఉంచారు. ఇప్పుడు ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది ఈ సాంగ్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారని అంటున్నారు.
మహేష్ బాబు గుంటూరు కారం ట్విట్టర్ పోస్ట్..
Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥
@MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy
— Satvik (@SatvikV1) February 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి