లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందని. ఇక ఈ అమ్మడు అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయింది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో తొలి విజయాన్ని అందుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మడు దశ తిరిగింది. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. అలాగే తమిళ్న హిందీ భాషల్లోనూ నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత కొంతకాలం ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాస్త గ్యాప్ తర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.
ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. దాంతో ఈ అమ్మడికి ఇప్పుడు మళ్లీ వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సరసన సినిమాలు చేస్తోంది. వీటితో పాటే ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా శ్రుతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో నటించాలంటే వయసుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని అంది శ్రుతి. సోషల్ మీడియాలో నటీనటుల వయసు గురించి ఎన్నో రకాల వార్తలు వస్తుంటాయి. అయితే వాటి గురించి తాను పెద్దగా పట్టించుకోనని కేవలం తాను తను నటించే పాత్రలపై మాత్రమే దృష్టి పెడతానని తెలిపింది. ప్రతి ఒక్క నటీనటులు తాము చేసే పాత్రలు అందరికి నచ్చాలని అనుకుంటారు. అయితే కొన్ని పాత్రలు వారికి నచ్చవచ్చు మరికొన్ని నచ్చకపోవచ్చు. నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో చాలామంది నేను నటించిన పాత్రలను ఇష్టపడలేదు. మొదట్లో నన్ను ఎవరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు సినిమాల పట్ల నాకు ఉన్న తపన అందరికీ అర్థమైంది. అందుకే నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.