ఒక్కసారి కమిటైతే అలాంటివి అస్సలు పట్టించుకోను.. ఆ హీరోలపై క్రేజీ హీరోయిన్ కామెంట్స్

ఆచితూచి సినిమాలు చేస్తుంది ఓ అందాల భామ. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఆ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన ఆమె ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.

ఒక్కసారి కమిటైతే అలాంటివి అస్సలు పట్టించుకోను.. ఆ హీరోలపై క్రేజీ హీరోయిన్ కామెంట్స్
Actress

Updated on: Jan 28, 2026 | 2:22 PM

స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు దొరికినప్పుడు హీరోయిన్లు ఆనందంతో ఎగిరి గంతేయాలా..? ఏజ్‌ లెక్కలేసుకుంటూ కూర్చోవాలా.? తాము రాసుకున్న కథకు ఫలానా హీరో, ఫలానా హీరోయిన్‌ అయితే పక్కాగా సరిపోతారని డైరక్టర్‌ ఫిక్స్ అయ్యాక, మీనమేషాలు లెక్కబెట్టుకోవాల్సిన అవసరం నాయికలకు ఉంటుందా? ఈ విషయాల మీద గతంలో స్పందించారు ఓ స్టార్ హీరోయిన్. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ఆమె ఓ పెద్ద హీరోయిన్, అలాగే ఓ స్టార్ హీరో కూతురు. యంగ్ హీరోలతో పాటు బడా హీరోల సరసన కూడా ఛాన్స్ లు అందుకుంటుంది. సీనియర్ హీరోల సరసన నటించడంతో ఆమె పై విమర్శలు కూడా వచ్చాయి. కేవలం రెమ్యునరేషన్‌ కోసమేననే విమర్శలూ వినిపించాయి. దానికి దీటుగా సమాధానం కూడా చెప్పింది ఆ ముద్దుగుమ్మ ఇంతకూ ఆమె ఎవరంటే..

క్రేజీ బ్యూటీ శ్రుతి హాసన్. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. ఇక ఏజ్ తో తనకంటే పెద్ద హీరోలతో స్టెప్పులేసింది. చిరంజీవి బాలకృష్ణ లాంటి బడా హీరోలతో సినిమాలు చేసింది శ్రుతి.  చిరంజీవి, బాలయ్య పక్కన నటించడానికి శ్రుతి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? యంగ్‌ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన టైమ్‌లో 60 ప్లస్‌ హీరోల సినిమాలకు ఎందుకు స్టెప్పులేస్తున్నట్టు..? అని పెద్ద చర్చే నడిచింది. అయితే, ఇలాంటి విషయాలను పట్టించుకోనని చెప్పేశారు శ్రుతిహాసన్‌

ఇవి కూడా చదవండి

గతంలో విషయం గురించి డీటైల్డ్ గా స్పందించారు శ్రుతి. సినిమాకు సైన్‌ చేసేటప్పుడు కథేంటి? నా పాత్ర ఏంటి? అని ఆలోచిస్తానే తప్ప, ఆ సినిమాలో హీరో ఎవరు? అతని డేట్‌ ఆఫ్‌ బర్త్ ఏంటి? నా వయసెంత? ఇద్దరి మధ్య ఏజ్‌ గ్యాప్‌ ఎంత ఉంది? అనే విషయాలను అసలు పట్టించుకోను. ఆ లెక్కలన్నీ డైరక్టర్‌వి. ఒక్కసారి ఫిల్మ్ మేకర్స్ ఓకే అనుకున్నాక, దాని గురించి పట్టించుకోవడం అనవసరం అని చెప్పారు. లెజెండ్స్ తో పనిచేసే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. చిరంజీవి, బాలయ్య నా దృష్టిలో లెజెండ్స్. వాళ్లతో పనిచేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..