Samyuktha meenan: హ్యాట్రిక్ హిట్స్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన సార్ మూవీ బ్యూటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి మెప్పించింది.

మలయాళ సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ సంయుక్తమీనన్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. భీమ్లానాయక్ సినిమాలో రానాకు జోడీగా నటించి మెప్పించింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో వెంటనే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాకూడా మంచి హిట్ గా నిలవడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ధనుష్ నటించిన సూపర్ హిట్ మూవీ సార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. సార్ సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి. సార్ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామ ఇప్పుడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడి పేరును సిఫార్స్ చేస్తున్నారు. దాంతో ఈ అమ్మడి క్రేజ్ పెరిగిపోయింది. దాంతో రెమ్యునరేషన్ కూడా పెంచాలని చూస్తుందట ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ సితార బ్యానర్ లోనే మరో సినిమా చేస్తుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం సంయుక్త మీనన్ భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో కొంత క్రేజ్ వచ్చిన ప్రతి హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సంయుక్త కూడా ఆ లిస్ట్ లోకి చేరిందని తెలుస్తోంది.




