Samantha: ‘తప్పు చేసినా.. చేయకున్నా నీదే బాధ్యత’.. సమంత ఆసక్తికర పోస్ట్
అందాల భామ సమంత గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత మరీ ఎక్కువగా వినిపిస్తోంది ఈ అమ్మడి పేరు.
అందాల భామ సమంతఐ(Samantha)గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. విడాకుల తర్వాత మరీ ఎక్కువగా వినిపిస్తోంది ఈ అమ్మడి పేరు. ఏం మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. కుర్ర హీరోలనుంచి స్టార్ హీరోల వరకు దాదాపు అందరి సరసన నటించి మెప్పించింది సామ్. తెలుగు తో పాటు తమిళ్ లోనూ ఈ అమ్మడు పాపులరే.. ఇక ఈ చిన్నదాని పరసనల్ లైఫ్ విషయానికొస్తే సామ్ అక్కినేని కుర్ర హీరో నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే..
ఇక ఫర్ ది ఫస్ట్ టైమ్ తమ పర్సనల్ లైఫ్‌పై నోరు విప్పింది సమంత. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో సమంత గెస్ట్‌గా వచ్చింది అక్కడ కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ ఇచ్చింది సమంత. ముఖ్యంగా చైతూతో తన కాపురం గురించి సెన్సిటివ్ ఇష్యూస్‌ని టచ్ చేశారు. తామిద్దరం ఒకే గదిలో ఉన్నప్పుడు… దగ్గర్లో ఆయుధాలేవీ లేకుండా చూసుకుంటామని, తమ మధ్య కాన్వర్జేషన్ అంత హీటెడ్‌గా ఉండేదని చెప్పారు సమంత. రిసెంట్ టైమ్స్‌లో సమంత ఇంతలా ఓపెనప్ కావడం ఇదే ఫస్ట్ టైమ్.
సమంత-చైతూ విడాకుల మిస్టరీ గురించి సినిమా సర్కిల్స్‌లోనూ ఫ్యాన్స్‌లోనూ చాలారోజులుగా టాక్ నడుస్తూనే ఉంది. అంతటి ముచ్చటైన జంట ఇంత ఈజీగా ఎలా విడిపోయింది అంటూ అనేక కారణాల గురించి ఆరా తీశారు అభిమానులు. కరణ్ కూడా తన షోలో సమంతను అడిగారు. మీ భర్త నుంచి విడిపోయేటప్పుడు మీ మైండ్ స్టేటస్ ఏంటి అని. కానీ… భర్త అనే మాట వినడానికే ఆమె ఇష్టపడలేదు. అతడు మాజీ భర్త అలాగే పిలవండి అని కరణ్‌కి సజెస్ట్ చేశారు సామ్. తాము జస్ట్ లైక్ దట్ అలా ఊరికే విడిపోలేదని.. ఆ విడిపోవడం వెనుక చాలా గడబిడ జరిగిందని చెప్పారు.
అయితే ఈ విషయంలో సామ్ ను కొందరు తప్పుపడుతున్నారు. ఆమెదే తప్పు అంటూ సామ్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ కొందరు. అటు చైతూ మాత్రం ఈ విషయం పై నోరుమెదపనప్పటికీ సామ్ ఛాన్స్ దొరికినప్పుడల్లా విచిత్రమైన కొటేషన్స్ తో.. తాను దైర్యవంతురాలినని, ఎవరికోసం మనం మారకూడదు, స్ట్రాంగ్ గా ఉండాలి అనే అర్ధాలు వచ్చేలా రోజు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టుకొచ్చింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో ఓపెన్ అప్ అయ్యిన సామ్.. ఇప్పుడు మరో పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టింది. నువ్వు తప్పు చేసినా నీదే బాధ్యత, తప్పు చేయకపోయినా నీదే బాధ్యత అంటూ సద్గురు చెప్పిన ఓ కొటేషన్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. మరి సమంత పెట్టిన ఈ పోస్ట్ కు అక్కినేని ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.