Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స !!..

హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని.. దీంతో నిన్న కొంచెం దగ్గు ఉండటంతో

Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స !!..
Samantha

Edited By: Ravi Kiran

Updated on: Dec 13, 2021 | 5:34 PM

హీరోయిన్ సమంత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని.. దీంతో నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు సమంత. సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. సోషల్ మీడియాలో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని సమంత మేనేజర్ మహేంద్ర తెలిపారు.

గత రోజులుగా ఆమె తిరుపతి, శ్రీకాళహస్తి, కడప సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఆమె జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో నిన్న కాస్త దగ్గు ఉండడంతో ఏఐజీ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకున్నారు సమంత.

ఇదిలా ఉంటే.. సమంత ఆదివారం కడపలోని మాంగళ్య షాపింగ్ మాల్ 11 వ షోరూమ్ ప్రారంభానికి హాజరయ్యారు..సమంతతోపాటు.. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఆర్టీసీ ఛైర్మన్ మల్లిఖార్జున రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు పాల్గోన్నారు. సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వేలాదిగా అక్కడికి తరలివచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్రౌడ్‌ను కంట్రోల్ చేశారు. ఇక సమంత గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప మూవీలో సామ్ స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తోంది.

 

Also Read: Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..

Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..