Dimple Hayathi: ఆ పాట కోసం ఏకంగా ఆరు కేజీలు తగ్గాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల భామ

|

Feb 09, 2022 | 7:23 AM

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి

Dimple Hayathi: ఆ పాట కోసం ఏకంగా ఆరు కేజీలు తగ్గాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల భామ
Dimple Hayathi
Follow us on

Dimple Hayathi: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఖిలాడి. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‏గా ఈ సినిమా రాబోతుందని ముందునుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలు, అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. తాజాగా హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ అమ్మడు మాట్లాడుతూ..

నా ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎవ‌రో చూసి ద‌ర్శ‌కుడుకి పంపార‌ట‌. నాకు క‌థ చెప్పిన‌ప్పుడు ర‌వితేజ‌తోపాటు ఈక్వెల్ గా వుంటుంద‌ని తెలిసింది. ర‌వితేజ‌గారు నా ఫొటో చూసి గ‌ద్దల‌కొండ గ‌ణేష్ లో సాంగ్ చేసింద‌ని అన్నార‌ట‌. ఇంత‌కుముందు చేసిన ద‌ర్శ‌కుల‌నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. గ‌ద్దల‌కొండ‌లో ఐటం సాంగ్ చేస్తే ఇక పై  అలాంటివే వ‌స్తాయ‌ని అన్నారు కూడా. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ కొంత గేప్ తీసుకుని న‌టిగా నిరూపించుకోవాల‌ని మంచి సినిమా కోసం వెయిట్ చేశాను అని తెలిపింది. ఇప్పుడ‌యితే ఐటం సాంగ్ లు చేయ‌లేను. ఫ్యూచ‌ర్‌లో వ‌స్తే ఆలోచిస్తాను అంటుంది డింపుల్. ల‌క్కీగా ర‌వితేజ సినిమాలు అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో నేను భిన్న‌మైన మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామ‌ర్ రోల్ సాంగ్ చేశా. న‌టిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది అని చెప్ప‌గ‌ల‌ను అంటుంది. అయితే మొద‌ట్లో ఈక్వెల్ పాత్ర అంటే భ‌య‌మేసింది. ఇలా చెబుతున్నారు. తీస్తారాలేదా! అనే అనుమానం కూడా క‌లిగింది. సినిమా చేశాక నాకు ద‌ర్శ‌కుడు చెప్పింది చెప్పిన‌ట్లు తీశారు అనిపించింది. యాక్ష‌న్ సీన్ త‌ప్పితే మొత్తం నా పాత్ర వుంటుంది. ఇలాంటి పాత్ర ఇంత‌కుముందు ఎప్ప‌డూ రాలేదు. ఇందులో భారీ తార‌గ‌ణం వుంది అని తెలిపింది డింపుల్ హయతి.

నేను ఖిలాడి చేశాక‌. సామాన్యుడు చేశాను. సామాన్యుడు లాకౌడ్‌న్‌లో 65 రోజులుల హైద‌రాబాద్‌లో చేశాను. ల‌క్కీగా రెండు సినిమాలు నెల‌గేప్‌లో ప్ర‌చారంలో రావ‌డం నా క‌ల నెరవేరిన‌ట్లుగా అనిపించింది. మిస్ దివా కంటెస్ట్‌లో నేనూ పాల్గొన్నా. మ‌ధ్య‌లో త‌ప్పుకున్నా.. నాకు డాన్స్ అంటే ఇష్టం. ఖిలాడిలో కేచ్ మి సాంగ్ చేయ‌డానికి ముందు లావుగా వున్నా. ద‌ర్శ‌కుడు న‌న్ను 6 కేజీలు త‌గ్గ‌మ‌న్నారు. త‌గ్గాక ఆ సాంగ్ చేశాను. ఇటలీలో సాంగ్ చిత్రీక‌ర‌ణ‌. అనుకోకుండా లాక్‌డౌన్ వ‌చ్చింది. షూట్ కేన్సిల్‌. రెండు నెల‌ల‌పాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయ‌డానికి డైట్‌తోపాటు వ్యాయామం చేశాను అని తెలిపింది డింపుల్ హయతి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్