పవన్‏తో నటించాలంటే ఇబ్బందిగా ఉండేది.. కోర్టు సీన్ తర్వాత వణికిపోయాను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న సినిమా వకీల్ సాబ్ పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగిపోతున్నాయి. ఇందులో పవన్

పవన్‏తో నటించాలంటే ఇబ్బందిగా ఉండేది.. కోర్టు సీన్ తర్వాత వణికిపోయాను.. హీరోయిన్ కామెంట్స్ వైరల్..
వచ్చిన ఆఫర్లకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తాను అంది. అంతే తప్ప రాని ఆఫర్ల కోసం బాధ పడను అంటూ చెప్పుకొచ్చింది అంజలి.
Follow us
Rajitha Chanti

| Edited By: Team Veegam

Updated on: Apr 02, 2021 | 5:37 PM

Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీతో వస్తున్న సినిమా వకీల్ సాబ్ పై రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగిపోతున్నాయి. ఇందులో పవన్ మున్నుపెన్నడూ లేని విధంగా పవర్ ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి ఓ కీలక పాత్రలో నటించింది. ఇక అంజలి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయలను వెల్లడించింది.

పింక్ సినిమా రీమేక్ చేస్తున్నాం… కానీ అందులో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటికి తగినట్లుగా తీస్తున్నాం అని దర్శకుడు శ్రీరామ్ వేణు నన్ను కలిసి చెప్పారు. ఈ మూవీ గురించి ఆయన చెప్పిన సీన్స్ నచ్చాయి. ఇందులో చేసిన మార్పులు మాకు కూడా వకీల్ సాబ్ ట్రైలర్ చూసాక పూర్తిగా అర్థమయ్యాయి అంటూ చెప్పుకోచ్చింది ఈ ముద్దుగుమ్మ.

పవన్ కళ్యాణ్ గారితో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్‏లో అంతా నిశబ్దంగా ఉంటుంది. నేను జనరల్‏గా ఎక్కువగా మాట్లాడుతాను. అలాంటి సమయంలో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్ అవుతారా అని భయపడ్డాను అంటూ తెలిపింది అంజలి. ఈ సినిమా కోసం పవన్ కొన్ని ఇన్ పూట్స్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మా క్యారెక్టర్ సరిగ్గా చేయాలి అనే నమ్మకం వచ్చింది. నాకు, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మా మధ్య సరిగ్గా రిలేషన్ లేకుంటే.. క్యారెక్టరైజేషన్స్ సరిగ్గా రావు. మా మధ్య అతి తక్కువ సమయంలోనే మంచి రిలేషన్ ఏర్పడింది అంటూ చెప్పుకోచ్చింది. ఈ సినిమాలో నాది చాలా బలమైన క్యారెక్టర్. అది మీకు ట్రైలర్‏లో వచ్చిన ఒకే ఒక డైలాగ్ వల్ల ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్ చాలా నా పాత్ర ఎంత బలమైనదో చెప్పడానికి. ఆ రోజు చేయాల్సినది కాదు. కానీ సడెన్‏గా షూట్ చేశాం. ఈ కోర్టు సీన్ చేశాక నేను వణికిపోయాను. చాలా ఉద్వేగానికి గురయ్యాను. నేను ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ చేసేప్పుడు నటిగా నేను ఉద్యేగపడతాను. అలా అయితేనే సీన్ కరెక్ట్‏గా వస్తుంది అని చెప్పుకోచ్చింది అంజలి.

Also Read: RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ నుంచి స్పెషల్ సర్‏ఫ్రైజ్ వచ్చేసింది.. పవర్‏ఫుల్ లుక్‏లో అజయ్ దేవ్‏గణ్..

Sarangadariya: ‘లవ్‏స్టోరీ’లో నా పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యింది.. పైర్ అవుతున్న నెటిజన్స్..

పాము విషం ప్రాణాలు తీయడమే కాదు.. రక్షిస్తుంది కూడా.! అదెలాగో తెలిస్తే షాక్ అవుతారు.!!