Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..

సినీరంగంలో హిట్టు వచ్చినా అవకాశాలు రావడం చాలా తక్కువ. ఇండస్ట్రీలో హీరోయిన్లుగా సత్తా చాటాలంటే అదృష్టం సైతం ఉండాల్సిందే. అయితే నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు ఈ ముద్దుగుమ్మకు. ఇంతకీ ఆమె ఎవరంటే..

Actress : ఈ జిడ్డు మొఖంది హీరోయినా అన్నాడు.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్స్..
Aishwarya Rajesh

Updated on: Jan 29, 2026 | 11:21 PM

ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే తమిళ సినిమా ప్రపంచంలో అగ్ర నటిగా మారింది. కంటెంట్ ప్రాధాన్యత, వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో చివరగా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తమిళంలో వరుస సినిమాలతో అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా గతంలో ఐశ్వర్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

కేవలం అందం, గ్లామర్‌తో వచ్చే అవకాశాలను కాకుండా, బలమైన కథలు, పాత్రలనే ఎంచుకుంటానని ఆమె చెప్పారు. “కౌసల్య కృష్ణమూర్తి” సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అని, దానికోసం బౌలింగ్ నేర్చుకోవడం లాంటి శారీరక శ్రమ చేశానని ఐశ్వర్య గుర్తు చేసుకున్నారు. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, టీవీలో ప్రసారమయ్యాక ఆ సినిమా పెద్ద హిట్ అయిందని, తనను “కౌసల్య అక్క”గా చిన్న పిల్లలు గుర్తించడం ఆశ్చర్యపరిచిందని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..

“వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌” చిత్రంలోని సువర్ణ పాత్ర గురించి మాట్లాడుతూ, తెలుగు హీరోయిన్లు తెల్లగా, సన్నగా, గ్లామరస్‌గా ఉండాలనే ఒక మైండ్‌సెట్ తనలోనూ ఉండేదని, అందుకే తాను తెలుగు సినిమాలకు సరిపోనని భావించానని చెప్పారు. అయితే, మేకప్ లేకుండా, ఐదేళ్ల బాబు తల్లిగా నటించిన సువర్ణ పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఆడియన్స్ చాలా ఓపెన్‌గా ఉన్నారని, కంటెంట్‌ను ఆదరిస్తారని ఆమె వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

భవిష్యత్తులో గ్లామరస్, డాన్సింగ్ రోల్స్ చేయాలని ఆశిస్తున్నానని, పది రోజుల షూట్ కోసం 10% డిస్కౌంట్ కూడా ఇస్తానని సరదాగా చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..