Vishal : ఏపీలో ఆయనే సీఎం.. హీరో విశాల్ ఆసక్తికర కామెంట్స్

|

Apr 17, 2024 | 9:51 AM

ప్రస్తుతం సినిమా సెలబ్రెటీలు రాజకీయాల్లో బిజీగా అవుతున్నారు. ఇప్పటికే దళపతి విజయ్, పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయాల్లో కొంతమంది స్టార్ హీరోలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తాజాగా విశాల్ కూడా రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తుంది. తాజాగా విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సీఎం జగన్‌పై నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం సినిమా సెలబ్రెటీలు రాజకీయాల్లో బిజీగా అవుతున్నారు. ఇప్పటికే దళపతి విజయ్, పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయాల్లో కొంతమంది స్టార్ హీరోలు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తాజాగా విశాల్ కూడా రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తుంది. తాజాగా విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సీఎం జగన్‌పై నటుడు విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా జగన్ సీఎం కాబోతున్నారంటూ కామెంట్ చేశారు విశాల్. నేను పార్టీ సపోర్టర్ కాదు.. ఐ లైక్ జగన్ అన్నారు విశాల్. రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారు. అందుకే నటులు రాజకీయాల్లోకి వస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేము. ఎక్కడో ఏసీ రూమ్‌లో కూర్చొని చేసే పని కాదు ఇది. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరిచిపోవాలంటున్నారు విశాల్.