Sandalwood drugs case: టాలీవుడ్ హీరో తనీష్ ఇటీవల చిక్కుల్లో పడ్డారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొడ్యూసర్ శంకర్‌గౌడ విషయమై తనీష్‌ను ఇటీవల అక్కడి పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో తనీష్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని ఆయన ఎమోషనల్ అయినట్లు తెలిపారు.
నిర్మాత శంకర్ గౌడ నివాసంలో ఆయన ఇచ్చిన పార్టీకి ఒకసారి మాత్రమే హాజరయ్యానని విచారించిన అధికారులకు తనీష్ చెప్పాడట. నోటీసులు పంపించడం వల్ల తాను ఒప్పుకొన్న కొత్త సినిమాలు ఆగిపోయినట్లు అతడు ఆవేదన చెందాడట. ఇంకోసారి విచారణ పేరుతో తనను పిలవద్దని అధికారులను తనీష్ రిక్వెస్ట్ చేశాడట. శంకర గౌడ కన్నడలో సినిమాలు నిర్మిస్తారని.. ఓసారి హైదరాబాద్‌లో కలిసి సినిమా చేస్తా అన్నారని.. అందుకే ఆయనతో టచ్‌లో ఉన్నట్లు తనీష్ పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశానని… ఆయన ఇచ్చిన పార్టీకి ఓ సారి హాజరయినట్లు తనీష్ వెల్లడించాడు.
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బెంగళూరు పోలీసులు తనీష్‌తోపాటు మరో ముగ్గురుని విచారణకు రావాలని అంతకుముందు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మార్చి 17న బెంగళూరులోని గోవిందపుర పోలీస్ స్టేషన్లో తనీష్‌ను అధికారులు విచారించారు. ఆ విచారణలోనే ఆయన ఈ కామెంట్స్ చేసినట్లు అధికారులు తెలిపారు. కేవలం విషయ సేకరణకు మాత్రమే నోటీసులు ఇచ్చారని, ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తనీష్ ఇటీవల ఓ వీడియో ద్వారా వెల్లడించారు. గతంలో డ్రగ్స్ కేసులో తన కుటుంబం ఎంతో ఇబ్బందిపడిందని, మళ్లీ ఇప్పుడు అవాస్తవాలు ప్రసారం చేయవద్దని తనీష్ కోరారు.
Also Read: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల
ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు